తెలంగాణలో కరోనా రోజువారి కేసులు క్రమ క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 26,947 శాంపిల్స్ పరీక్షించగా… 140 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఈరోజు కరోనా కారణంగా ఇద్దరు మరణించారు. ఇదే సమయంలో 186 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,80,553 కు చేరుకోగా… రికవరీ కేసులు 6,73,033 […]
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేదని సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించిన కొన్ని రోజులకే సంయుక్త సమాజ్ మోర్చా ఏర్పాటు చేయాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. SKM కింద 32 ప్రధాన రైతు సంఘాలు పోరాటం చేశాయి. ఇందులో 22 సంఘాలు కొత్త రాజకీయ పార్టీ పెట్టాలని నిర్ణయించాయి. షెడ్యూల్ ప్రకారం పంజాబ్‌లో ఫిబ్రవరి – మార్చి నెలల్లో ఎన్నికలు జరిగే అవకాశముంది. కొత్త పార్టీ రిజిస్ట్రేషన్, గుర్తు కష్టం కాబట్టి… ఆమ్ ఆద్మీ […]
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర తోమర్ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. బిజెపి కుట్ర రాజకీయాలకు పాల్పడుతోందని మండిపడ్డారు కేటీఆర్. సాగు చట్టాలను రద్దు చేయడం.. మోడీ క్షమాపణలు చెప్పడం ఎన్నికల స్టంటేనని బీజేపీ పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. సాగు చట్టాలను రద్దు చేశామని మోడీ అంటారని… సాగు చట్టాలు మళ్లీ తెస్తామని కేంద్ర మంత్రి అన్నారని కేటీఆర్ గుర్తు చేశారు. బిజెపి రాజకీయాల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని […]
తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు క్రమ క్రమంగా పెరిగి పోతున్నాయి. తెలంగాణ రాష్ట్రం లో కొత్తగా 3 ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో తెలంగాణ రాష్ట్రంలో 41 కి ఒమిక్రాన్ కేసుల సంఖ్య చేరింది. ఇవాళ ఒమిక్రాన్ వచ్చిన ముగ్గురు వ్యక్తులు… విదేశాల నుంచి వచ్చిన వారే కావడం గమనార్హం. అయితే.. ఈ ముగ్గురు ఇంకా ఎవరినైనా కలిసారా.. అనే దానిపై వైద్య అధికారులు ఆరా తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా..తెలంగాణ రాష్ట్రంలో న్యూ […]
కేసీఆర్ ప్రభుత్వానికి పోయే కాలం దగ్గర పడిందని..అందుకే చిల్లర రాజకీయాలు చేస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీ ఎస్ ఎస్ ప్రభాకర్. ఇవాళ ఆయన కరీంనగర్ లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో పాలన స్తంభించిందని.. రాజకీయమే పరమావధిగా టీఆర్ ఎస్ వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సొంత పార్టీ ప్రజా ప్రతినిధులనే కొనుగోలు చేసే దౌర్భాగ్య పరిస్థితికి టీఆర్ ఎస్ ప్రభుత్వం దిగజారిందని నిప్పులు చెరిగారు. […]
తెలంగాణలో టీఆర్‌ఎస్-బీజేపీ మధ్య పొలిటికల్ గేమ్ రసవత్తరంగా నడుస్తోంది. జనం దృష్టిలో వీరు ఒకరి మీద ఒకరు కత్తులు దూసుకుంటారు. కానీ అవసరం ఉన్నప్పుడు ఒకరికొకరు సాయం చేసుకుంటారనేది బహిరంగం రహస్యం. బహుశా అందుకే కావచ్చు కాంగ్రెస్ పార్టీ తరచూ వీరిది మ్యాచ్ ఫిక్సింగ్ బంధమని ఎగతాళి చేస్తుంటుంది. రహస్య స్నేహితులని ఆరోపిస్తుంటుంది. ఇప్పుడు వరి ధాన్యం కొనుగోలు అంశంపై రెండు పార్టీలు చేస్తున్న హంగామా కూడా అలాంటిదేనా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు. ఖరీఫ్ […]
తెలంగాణ రాష్ట్రంలో న్యూ ఇయర్ వేడుకల పై ఆంక్షలు విధించింది కేసీఆర్ సర్కార్. హై కోర్టు ఆదేశాలతో ఆంక్షలు విధించింది తెలంగాణ ప్రభుత్వం. ఇవాళ్టి నుంచే జనవరి 2వ వరకు ఆంక్షలు అమలు కానున్నాయి. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది కేసీఆర్ సర్కార్. డిసెంబర్ 31 నుండి జనవరి 2 వరకు ర్యాలీ లు , బహిరంగ సభలు నిషేధిస్తూ… ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఓమిక్రాన్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలన్న ప్రభుత్వం… పబ్లిక్ ఈవెంట్స్ […]
పార్టీకి ఛార్జింగ్ ఎక్కించేందుకు అక్కడ టీడీపీ ప్రయోగాలు చేస్తోందా? ఈక్వేషన్లు తేడా కొడుతున్నాయా? బలమైన నాయకత్వం ఉన్నా.. క్షేత్రస్థాయిలో పార్టీ బలహీనంగా ఉందా? తాజా ప్రయోగమైనా ఫలితాన్నిస్తుందా? ఏంటా నియోజకవర్గం? ఇంఛార్జ్ మార్పు టీడీపీకి కలిసి వస్తుందా? కర్నూలు జిల్లా నందికొట్కూరు. ఈ నియోజకవర్గంలో ఒకప్పుడు బలంగా ఉన్న టీడీపీ ఇపుడు జీరో అనే చెప్పాలి. ఈ పరిస్థితికి టీడీపీ అధిష్ఠానం బాధ్యతారహిత్యం కూడా కారణమని చెబుతారు. పచ్చ జెండాపై ప్రేమ, టీడీపీపై అభిమానం ఉన్న కేడర్‌లో […]
ఏపీ లో కరోనా కేసులు ఓ రోజు పెరుగుతూ ఓ తగ్గుతూ వస్తున్నాయి. అయితే.. తాజాగా ఏపీ ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. ఏపీలో కొత్తగా 104 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అయితే ఈరోజు కరోనా కారణంగా ఒకరు మరణించారు. ఇక, ఇదే సమయంలో 133 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 3,11,56,578 కు చేరుకోగా… మొత్తం […]
విశాఖపట్నంలో ఇవాళ పర్యటించిన బీజేపీ ఎంపీ సుజనా చౌదరి.. ఏపీ ప్రభుత్వం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ పాలనలో ఏపీ 30ఏళ్ళు వెనక్కుపోయిందని నిప్పులు చెరిగారు. బీహార్ కంటే దారుణమైన పాలన ఏపీలో ఉందని…రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న లొసుగులు కారణంగానే కేంద్రాన్ని అడగలేకపోతున్నారన్నారు. రాష్ట్రంలో తలా తోక లేని పాలన జరుగుతోందని… వచ్చే 30 నెలల్లో భారతీయ జనతా పార్టీ సమర్ధత ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. హాయగ్రీవ జగదీశ్వరుడు వెనుక తన ప్రమేయం లేదన్నారు ఎంపీ […]