విశాఖపట్నంలో ఇవాళ పర్యటించిన బీజేపీ ఎంపీ సుజనా చౌదరి.. ఏపీ ప్రభుత్వం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ పాలనలో ఏపీ 30ఏళ్ళు వెనక్కుపోయిందని నిప్పులు చెరిగారు. బీహార్ కంటే దారుణమైన పాలన ఏపీలో ఉందని…రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న లొసుగులు కారణంగానే కేంద్రాన్ని అడగలేకపోతున్నారన్నారు. రాష్ట్రంలో తలా తోక లేని పాలన జరుగుతోందని… వచ్చే 30 నెలల్లో భారతీయ జనతా పార్టీ సమర్ధత ఏంటో చూపిస్తామని హెచ్చరించారు.
హాయగ్రీవ జగదీశ్వరుడు వెనుక తన ప్రమేయం లేదన్నారు ఎంపీ సుజనా చౌదరి.. జగదీశ్వరుడు ఎవరో తనకు తెలీదని.. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తనతో ఈ విషయమై మాట్లాడలేదని చెప్పారు. జగదీశ్వరుడుకి అన్యాయం జరిగిందా లేదా అన్నది ముఖ్యమని తెలిపారు. జగదీశ్వరుడు కే కాదు, సుబ్బారావు గుప్తా లాంటి వైసీపీ నేతలు కూడా ఇబ్బందులు పడుతున్నారని.. వైసీపీ నేతలు అభద్రతా భావంలో వున్నారన్నారు.