ఏపీలో కరోనా కేసులు ఓ రోజు పెరుగుతూ.. ఓ రోజు తగ్గుతూ వస్తున్నాయి. అయితే.. తాజాగా ఏపీ ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. ఏపీలో కొత్తగా 82 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అయితే ఈరోజు కరోనా కారణంగా ఒకరు మరణించారు. ఇక, ఇదే సమయంలో 164 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 3,11,81,664 కు చేరుకోగా… మొత్తం […]
కేసీఆర్ సర్కార్ పై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆంధ్ర రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు మానవ మృగాలుగా మారిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీతి బాహ్యమైన రాజకీయాలు చేస్తున్నారని… చట్టంలో మద్దతు ధర ఉన్న పంటకు రైతులకు రక్షణ ఉంటుందని పేర్కొన్నారు. యాసంగిలో వడ్లు వేయాలని.. ఎట్లా కొనడో చూద్దామని స్పష్టం చేశారు. వడ్లు కొనని వాడు కుర్చీ మీద ఎట్లా కూర్చుంటాడని ఫైర్ అయ్యారు. వండ్లు కొనకపోతే… టీఆర్ ఎస్ ప్రభుత్వాన్ని బొంద […]
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సన్మాన సభలో… సుప్రీం కోర్టు సీజే ఎన్వీ రమణ చలోక్తులు విసిరారు. సెల్ఫీలు, బొకేలు, శాలువా కప్పి ఫోటోలు తీసుకోవడం పై తాపత్రయం వద్దని ఎన్వీ రమణ పేర్కొన్నారు. నేను ఇక్కడి వాడిని… నేను సినిమా హీరోను కాదంటూ ఎన్.వి.రమణ తెలిపారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి వారే రిటైర్మెంట్ తర్వాత చూస్తామని పేర్కొన్నారు. రెండు రోజుల నుంచి వరుస కార్యక్రమాలు జరుగుతున్నాయి… తెలంగాణ హైకోర్టు సీజే వెళ్లిపోయారని తెలిపారు. మిగితా వారు కూడా వెళ్లి […]
వైసీపీ మళ్ళీ అధికారం లోకి రావడం ఖాయమని.. ఈ విషయాన్ని ఎల్లో మీడియా గుర్తు పెట్టుకోవాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్నికల ఫలితాలు మార్చే పరిస్థితి ఉండదని చురకలు అంటించారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేశారని… గ్రామాల్లోకి వెళితే కేవలం ఇల్లు కోసం అర్జీలు, లేదా భూ వివాదాలపై మాత్రమే ఫిర్యాదులు అందుతున్నాయని చెప్పారు. జగనన్న శాశ్వత భూ హక్కు, […]
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ.. మరణించిన రైతులకు నిన్న తెలంగాణ ప్రభుత్వం పరిహారం విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే.. పరిహారం విడుదల చేయడం పై కేసీఆర్ పై షర్మిల సెటైర్లు వేశారు. కేసీఆర్ గారూ.. అందరూ రైతులకు పరిహారం ఇచ్చి.. పాప ప్రక్షాళన చేసుకోవాలన్నారు. చనిపోయిన రైతులు ఎందరు? మీరు ఇచ్చే పరిహారం ఎందరికి? ఇప్పటివరకు దాదాపు 7600 మంది రైతులు చనిపోతే 1600 మందికి పరిహారం ఇస్తే సరిపోతుందా? అని ప్రశ్నించారు. పరిహారం […]
బీజేపీవి మొత్తం చీప్ ట్రిక్స్ రాజకీయాలేనని… మతకల్లోలాలు సృష్టించేందుకు బీజేపీ యత్నిస్తుందని ఫైర్ అయ్యారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. హైదరాబాద్ కు వస్తున్న ఐటీ, ఇతర కంపెనీలను చూసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గర్వపడాలని.. బీజేపీ అధ్యక్షుడు చేయబోయే దీక్ష ఎందుకో చెప్పాలి, యువకులు బీజేపీ చేస్తున్న ట్రిక్స్ గమనించాలని కోరారు. లాభాల్లో ఉన్న ప్రభుత్వ సంస్థలను ఎందుకు అమ్ముతున్నారో కేంద్ర ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు.. 14 లక్షల మంది వలస వెళ్లే పాలమూరు జిల్లాకు […]
రైతు చట్టాలను మళ్లీ తీసుకు వస్తామని కేంద్ర మంత్రి నరేంద్ర తోమర్ నిన్న వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే.. ఆయన చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు నిప్పులు చెరిగారు. రైతు చట్టాలపై కేంద్ర మంత్రి తోమర్ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని.. భేషరుతుగా దేశ రైతాంగానికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నల్ల చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం, తిరిగి […]
కరోనా వ్యాక్సినేషన్ పై ప్రధాని మోడీ కీలక ప్రకటన చేశారు. జనవరి 3 నుంచి పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రారంభం కానుందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. 15-18 ఏళ్ళ వారికి వ్యాక్సిన్ కొనసాగుతుందన్నారు మోడీ. జాతి నుద్దేశించి ప్రధాని మోడీ ఇవాళ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఒమిక్రాన్ వ్యాపిస్తోందని… ఒమిక్రాన్ విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. పిల్లల కోసం బెడ్స్ సిద్ధంగా వున్నాయని… కరోనాను మనం సమర్థంగా ఎదుర్కొన్నామన్నారు. మనం వ్యాక్సిన్ల విషయంలో అందరికంటే ముందున్నాని […]