నేటి నుంచే ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ప్రారంభం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడ శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో దేవీశరన్నవ రాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయ్. ప్రతీఏటా నవరాత్రి ఉత్సవాలు నిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది. ఐతే…కోవిడ్ పరిస్థితులతో…ఆంక్షల నడుమ ఏర్పాట్లు చేశారు. రోజుకు గరిష్టంగా 10 వేల మందికి దర్శనం దక్కేలా అధికారులు నిర్ణయం తీసుకున్నారు. గత సంవత్సరం మాదిరిగా టైం స్లాట్ ప్రకారముగా రోజుకు పదివేల మంది భక్తులను మాత్రమే అనుమతిస్తారు. భక్తులు ఆన్‌లైన్ ద్వారా టైం స్లాట్ ప్రకారం వెబ్‌సైట్‌లోకి వెళ్లి దర్శనం టిక్కెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సేవా టిక్కెట్లను మొత్తం కెపాసిటీలో 50 శాతం మాత్రమే కోవిడ్ నిభంధనల మేరకు అనుమతిస్తారు.
ఆన్‌లైను టిక్కెట్టు లేకుండా వచ్చే భక్తులకు, అసౌకర్యం లేకుండా వి.ఎం.సి.ఆఫీసు, టోల్‌గేటు, ఓమ్ టర్నింగ్ వద్ద, పున్నమి ఘాట్ వద్ద కరెంటు బుకింగ్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. అన్ని క్యూ మార్గాల్లోను రోజుకు 3సార్లు సోడియం హైపో క్లోరైడ్‌తో స్ప్రే చేస్తారు. క్యూమార్గంలో శానిటైజేషన్తో పాటు ధర్మల్ గన్స్‌తో చెక్ చేసిన తరువాతే భక్తులను అనుమతిస్తున్నారు.
Also Read
- Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
- AP Govt: దేశంలో తొలిసారిగా 3డీ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణాలు.. ఏక కాలంలో 3 లక్షల ఇళ్లు..
- Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
- Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
దేవస్థానంలో ప్రస్థుతం 150 సెక్యూరిటీ సిబ్బంది వారికి అదనముగా 150 మంది సిబ్బందిని భద్రత కోసం వినియోగిస్తున్నారు. 3 వేల మంది పోలీసులతో దసరా ఉత్సవాలకు భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు.మరోవైపు…దసరా ఉత్సవాలకు వచ్చే భక్తులు కోవిడ్ నిబందనలను పాటించాలని అధికారులు సూచించారు. 10 ఏళ్ల లోపు పిల్లలు, 60 ఏళ్ల పైబడిన వారికి దర్శనానికి అనుమతి లేదని స్పస్టంచేశారు. కోవిడ్ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ మళ్లింపులు, పార్కింగ్ ఏర్పాట్లపైనా సిబ్బంది సూచనలను పాటించాలని తెలిపారు పోలీసులు.
తాజావార్తలు
-
Team India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. 4 ఏళ్ల తర్వాత జట్టులోకి స్టార్ ప్లేయర్..
-
Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
-
Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
-
WI Vs Ind: ముగిసిన వెస్టిండీస్ బ్యాటింగ్.. భారత్ టార్గెట్ 172 పరుగులు..
-
Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!