మన దేశంలో కరోనా కేసులు పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్నాయి. నిన్న 18 వేలు క్రాస్ చేసిన కరోనా మహమ్మారి కేసులు.. ఇవాళ ఏకంగా 15 వేలకు తగ్గుమఖం పట్టాయి. ఇక కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం… గత 24 గంటల్లో కొత్తగా 15,786 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 231 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు వదిలారు.. ఇక, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,75,745 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో […]
నెల 27న హన్మకొండ జిల్లా పెంచికల్ పేటలో జరగాల్సిన సీఎం కేసీఆర్ అభినందన సభకు కేంద్ర ఎన్నికల కమిషన్ తాజా ఉత్తర్వులు అడ్డంకిగా మారింది. ఉప ఎన్నికతో ప్రత్యక్షంగా సంబంధం ఉన్న జిల్లాలు, చుట్టు పక్కల నియోజకవర్గాల్లో ఏ రాజకీయ కార్యకలాపాలు చేపట్టకూడదని సీఈసీ ఆదేశించడంతో…సభ రద్దయినట్టు తెలుస్తోంది. దీంతో టీఆర్ఎస్ ఎలాంటి ప్రత్యామ్నాయాలు చేస్తుందనేది ఆసక్తిగా మారింది. దేశంలోని పలు నియోజకవర్గాల్లో ఉపఎన్నికల కారణంగా కేంద్ర ఎన్నికల సంఘం తాజా మార్గదర్శకాలు విడుదల చేసింది. బై […]
మన దేశంలో పెట్రోలు ధరలు భగ్గుమంటున్నాయి. రోజు రోజుకు పెరగడం తప్ప… తగ్గుదల అసలు కనిపించడంలేదు. పెరుగుతున్న పెట్రో ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో సెంచరీ కూడా దాటేశాయి. ఇక తాజాగా మరోసారి పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెరిగిపోయాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ పై 35 పైసలు, లీటర్ డీజిల్ పై 35 పైసలు పెరిగింది. ఈ పెరుగుదలతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 106.89 చేరగా.. లీటర్ […]
అమెరికాను మరో కొత్త వ్యాధి వణికిస్తోంది. వంటగదిలో ఉండే ఉల్లిపాయల నుంచి సాల్మొనెల్లోసిస్ అనే వ్యాధి వ్యాపిస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు.సాల్మోనెల్లా బ్యాక్టీరియా వ్యాప్తికి ఉల్లిపాయలకు మధ్య సంబంధం ఉందని సెంటర్స్ ఫర్ డెసీస్ అండ్ ప్రవెన్షన్ (CDC) తేల్చింది. అక్టోబరు 18 నాటికి 37 రాష్ట్రాల్లో 652 మందికి వ్యాపించిందని CDC డేటా తెలిపింది. ఈ వ్యాధి మరింత ప్రబలితే మహమ్మారిగా మారే నిజానికి సెప్టెంబరు నెల మధ్యలోనే […]
తిరుమల శ్రీ వారి భక్తులకు తీపి కబురు చెప్పింది టీటీడీ పాలక మండలి. ఇవాళ ఉదయం 9 గంటలకు ఆన్ లైన్ లో ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను విడుదల చేయనుంది. నవంబర్, డిసెంబర్ నెలలకు సంబంధించిన టిక్కెట్లను ఇవాళ విడుదల చేయనున్నారు.. ఇందులో భాగంగానే ప్రతి రోజూ 12 వేల చొప్పున టికెట్లను విడుదల చేసేందుకు టీటీడీ పాలక మండలి సిద్ధమైంది… ఇక రేపు సర్వదర్శనం టోకెన్లు విడుదల చేయనుంది టీటీడీ. నవంబర్ నెలకు సంబంధించి […]
బంగారం… దీనికి ఉన్న విలువ ప్రపంచంలో దేనికి ఉండదు. మన ఇండియాలోనైతే.. బంగారానికి ఉన్న క్రేజ్ మరేదానికి లేదు. బంగారం కొనడానికి మహిళలకు బాగా ఇష్ట పడతారు. అయితే… మన దేశంలో బంగారం ధరలు నిలకడగా ఉండకుండా…. పెరుగుతూ… తగ్గుతూ వస్తున్నాయి. గత నాలుగు రోజులుగా పెరుగుతూ వచ్చిన.. పసిడి ధరలు ఇవాళ మరోసారి ఎగిసిపడ్డాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 100 పెరిగి […]
కేరళను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా శబరిమల పుణ్యక్షేత్రం, అయ్యప్ప జన్మస్థలమైన పందళం, అచ్చన్‌కోవిల్ వంటి ముఖ్యమైన సందర్శక ప్రదేశాలున్న పతనంతిట్ట జిల్లాతోపాటు.. దేశ, విదేశీ పర్యాటకుల తాకిడి అధికంగా ఉండే ఇడుక్కి జిల్లా, అటు తమిళనాడులోని త్రిషూర్ జిల్లాలో వరద బీభత్సం కొనసాగుతోంది. పంపానదిపై ఉన్న కక్కి డ్యామ్ వద్ద వరద ఉధృతి పెరుగుతుండడంతో నీటిని కిందకు వదలాలని అధికారులు నిర్ణయించారు. దీని వల్ల పంపాబేస్ వద్ద నది ఉప్పొంగనుంది. డ్యామ్ తెరిస్తే శబరి […]
తెలంగాణలో మద్యం షాపులకు ఉన్న డిమాండ్ అంతా ఇంతకాదు.. నష్టాల్లేని వ్యాపారం ఏదైనా ఉందంటే అది ఒక్క మద్యం వ్యాపారమేననే ప్రచారం ఉంది. మద్యం షాపు కోసం ఎంత పెట్టుబడి పెట్టినా అంతకు పదిరెట్లు లాభం వస్తుందనే నమ్మకం వ్యాపారుల్లో ఉంది. దీంతో మద్యం షాపులను దక్కించుకునేందుకు వ్యాపారులంతా క్యూ కడుతుంటారు. మద్యం షాపుల టెండర్లలో పాల్గొని తమ అదృష్టాన్ని పరీక్షించుకే ప్రయత్నం చేస్తుంటారు. ఒక్కసారి మద్యం షాపు దక్కిందా? ఇక తమ దశ తిరిగినట్లేనని భావించే […]
ఏపీలో ఇవాళ మళ్లీ కరోనా కేసులు పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. ఇక ఇవాళ ఏపీ ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 44, 086 శాంపిల్స్ పరీక్షించగా.. 523 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మరో ముగ్గురు కోవిడ్ బాధితులు మృతి చెందారు. ఇక, ఇదే సమయంలో 608 మంది కోవిడ్ నుంచి పూర్తి స్థాయి లో కోలుకున్నారు. దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కరోనా నిర్ధారణ […]