రాష్ట్రంలోని బీసీ మనసుల్లో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సుస్థిర స్థానం సంపాదించుకున్నారు అంటూ సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ అన్నారు. రాష్ట్రాలు కుల గణన చేసుకోవచ్చని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.. అందులో భాగంగానే ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాం అని ఆయన పేర్కొన్నారు.
ఒత్తైన, అందమైన హెయిర్ తమ సొంతమవ్వాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అయితే, సరైన ఆహారం తీసుకోకపోవడం, జీవనశశైలీ, కాలుష్యం ఇలా అనేక రకాల కారణాల వల్ల విపరీతంగా జుట్టు రాలిపోతుంది. దీంతో ఎంత ఖరీదైన ట్రీట్మెంట్ తీసుకున్నా.. బెస్ట్ ప్రొడక్ట్స్ యూజ్ చేసిన చాలా మంది ఈ సమస్య నుంచి బయటపడలేరు.
సీఎం కేసీఆర్ సిద్దిపేటలో నిర్వహించిన బహిరంగ సభ ముగిసిన అనంతరం తిరిగి హైదరాబాద్ కు బయలు దేరారు. అయితే, సిద్దిపేట నుంచి తిరుగు ప్రయాణమైన కేసీఆర్ మార్గ మధ్యంలో ‘సోనీ ఫ్యామిలీ దాబా'లో కాసేపు ఆగారు. బీఆర్ఎస్ నేతలతో కలిసి దాబాలో కేసీఆర్ చాయ్ తాగుతు కనిపించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారంలోకి దిగుతుంది. ఇందుకోసం బస్సు యాత్రలు చేసేందుకు రెడీ అయింది. బస్సు యాత్రను ప్రారంభించేందుకు జాతీయ స్థాయి నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు తెలంగాణకు రానున్నారు. మూడు రోజుల పాటు.. 8 నియోజకవర్గాల్లో సాగే ఈ బస్సు యాత్రలో రాహుల్ పర్యటించనున్నారు.
ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి మాట్లాడుతూ.. చంద్రబాబు కుటుంబం పై హాట్ కామెంట్ చేశారు. దగ్గుబాటి పురంధేశ్వరి బీజేపీ నుంచి వచ్చి చంద్రబాబుకు ఆయన కొడుకు కోవర్టుగా పనిచేయడానికి వచ్చిందా అని ఆయన ప్రశ్నించారు.
తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సాలకు మూడు అంచెల భద్రత ఏర్పాటు చేశామని తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. దాదాపు 1800 మంది పోలీసులు విధులు నిర్వహించనున్నారు.. గరుడ సేవ రోజు 1253 మంది పోలీసులు అదనంగా బందోబస్తులో పాల్గొంటారు.
ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉండి నారాయణస్వామి బుద్ధి, జ్ఞానం లేకుండా మతిలేని వాడిలా మాట్లాడాడు అని మాజీ మంత్రి నన్నపనేని రాజ కుమారి విమర్శలు చేశారు. ఆయనతో ఎవరు మాట్లాడించారో ప్రజలకు తెలుసు.. స్వర్గీయ ఎన్టీఆర్, చంద్రబాబు కుటుంబాలను ఉద్దేశించి అనరాని మాటలనేవారు అసలు మనుషులేనా అన్న సందేహం కలుగుతోంది.
బీసీ కుల గణనతో సమూల మార్పులు వస్తాయని ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు అన్నారు. కుల గణన వల్ల అన్ని వర్గాలకూ లబ్ధి చేకూరుతుంది.. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కుల గుణన చేపట్టాలి.. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బీసీ కులాల గణనను చేపట్టాలి అని ఆయన డిమాండ్ చేశారు.
దీపావళి పండుగ దగ్గర పడుతుండడంతో పెద్ద ఎత్తున బాణాసంచాలను తయారు చేసి, నిల్వ ఉంచారు. ఇవాళ మధ్యాహ్నం ఆ షాపులో బాణాసంచా కొనుగోలు చేసిన కొందరు ఆ షాపు ముందే వాటిని కాల్చి వేశారు. దీంతో అనుకోకుండా ఓ ఫైర్ క్రాకర్ మండుతూ ఆ షాపులోకి దూసుకుపోయింది. దాంతో, ఒక్కసారిగా అందులోని బాణాసంచా పెద్ద ఎత్తున పేలింది. గంటకు పైగా, ఈ పేలుళ్లు కొనసాగినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు.
స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ పై టిడిపి నేతలు అసత్య ఆరోపణలు చేయడంపై మాజీ మంత్రి పేర్నినాని మండిపడ్డారు. ఆధారాలు చూపకుండా జైల్లో ఎవరు పెట్టారు చంద్రబాబును అని ఆయన ప్రశ్నించారు.