ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవినీతికి ఎక్కడా తావులేకుండా పాలన అందిస్తున్నామని వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యనించారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మ్యానిఫెస్టోలో ప్రకటించిన అన్ని కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు.
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో 26 వ తేదీ నుంచి వైసీపీ సామాజిక న్యాయ యాత్ర బస్సు యాత్ర ప్రారంభం అవుతుంది అని వైసీపీ జోనల్ ఇంచార్జ్, జిల్లా ఇంచార్జ్ మంత్రి బొత్సా సత్యనారాయణ అన్నారు. సమ సమాజ స్దాపన కోసం సీఎం జగన్ కృషిచేస్తున్నారు..
జాతీయ వైద్య మండలి కొత్తగా తీసుకొచ్చిన నిబంధనలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టం వాటిల్లుతోందని, వాటిని సడలించి పాత పద్ధతి కొనసాగించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజినీ కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్సూక్ మాండవీయను కలిసి విజ్ఞప్తి చేశారు.
ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను టీడీపీ నేతల బృందం కలిసింది. స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు అరెస్ట్ అంశంతో పాటు రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలను గవర్నరుకు తెలుగు తమ్ముళ్లు వివరించారు.
సీఎం జగన్ మాట్లాడుతూ.. డ్రై రేషన్ పంపిణీ పై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలి అని తెలిపారు. ఇప్పుడు అమలవుతున్న విధానంపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలి.. రేషణ్ నాణ్యత విషయంలో ఎక్కడా లోపాలు ఉండకూడదు అని అధికారులకు సీఎం చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నకలీ ఓట్లను తొలగించాలని వైసీపీ నేతలు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారితో మంత్రులు సమావేశం అయ్యారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఓట్ల జాబితాలో అవకతవకలపై కంప్లైంట్ చేశారు.
అమరావతి ఇన్నర్ రింగు రోడ్డు అలైన్మెంట్ మార్పు కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడికి ఏపీ హైకోర్టు ఊరట లభించింది. నవంబరు 7వ తారీఖు వరకు చంద్రబాబును అరెస్టు చేయొద్దని న్యాయస్థానం ఆదేశించింది.
భుత్వ పదవులు ఇప్పిస్తానంటూ కోట్ల రూపాయలు వసూలు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, నిందితుడు విశ్వతేజగా పోలీసులు గుర్తించారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ బంగారపు షాపు యజమాని దగ్గర, రాజ్యసభ సీటు ఇప్పిస్తానని చెప్పి కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.