భోగి వేడుకల్లో మంత్రి అంబటి రాంబాబు డ్యాన్స్..
పల్నాడు జిల్లా సత్తనపల్లి గాంధీ బొమ్మల సెంటర్లో మంత్రి అంబటి రాంబాబు అధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సంక్రాంతి వేడుకలకు ప్రజలు భారీగా హాజరు అయ్యారు. భోగి వేడుకలలో భాగంగా మంత్రి అంబటి రాంబాబు ప్రత్యేక డాన్స్ చేశాడు. అయితే, మంత్రి అంబటి రాంబాబు గత నాలుగైదు ఏళ్ల నుంచి భోగి మంటల దగ్గర సందడి చేస్తున్నారు. బంజారా మహిళలతో కలిసి హుషారుగా స్టెప్పులు వేస్తున్నారు. గత ఏడాది మంత్రి వేసిన స్టెప్పులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ సందర్భంగా మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. నేను సంక్రాంతి వేడుకలు చేస్తుంటే అందరూ సంబరాల రాంబాబు అంటున్నారు.. సంక్రాంతికి నేను సంబరాల రాంబాబునే.. సంక్రాంతి దాడితే నేను పొలిటికల్ రాంబాబుని.. సంబరాలు ఎంత సంబరంగా చేస్తానో.. రాజకీయాలు అంత సీరియస్ గా చేస్తాను.. సత్తెనపల్లిలో ప్రతి కుటుంబం సంక్రాంతి వేడుకలు జరుపుకోవాలి అన్నదే నా ఆలోచన అని ఆయన పేర్కొన్నారు.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లను తరిమేయండి.. వాళ్లు నాన్ లోకల్
నగరిలో తన నివాసం దగ్గర జరిగిన భోగి మంటల దగ్గర భర్త సెల్వమణితో కలిసి మంత్రి రోజా వేడుకలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ.. ఈ సంక్రాంతి అందరికీ జీవితాల్లో వెలుగు నింపాలి అని పేర్కొన్నారు. ప్రజలందరూ టీడీపీ- జనసేన పార్టీల చెత్త మ్యానిఫెస్టోని, చెత్త మాటలను భోగి మంటల్లో వేసి తగలపెడుతున్నారు.. సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నుంచి ఊర్లకు వచ్చినట్లు చంద్రబాబు, పవన్ వచ్చారు.. ఇక, హైదరాబాద్ నుంచి వచ్చిన ఇద్దరు నాన్ లోకల్ నేతలు భోగి వేస్తున్నారు అని ఆమె విమర్శలు గుప్పించారు. భోగి పండగ, 2024 ఎన్నికలు అవ్వగానే మళ్ళీ హైదరాబాద్ కు పవన్ కళ్యాణ్, చంద్రబాబు వెళ్ళిపోతారు.. ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబు, పవన్ లను తగలబెట్టి, తరిమేయండి అని మంత్రి రోజా పిలుపునిచ్చారు. మా పార్టీని భోగిమంటల్లో తగుల పెడతామని టీడీపీ నేతలు చెబుతున్నారు.. 2019లోనే మిమ్మల్ని తగులు పెట్టారు అనేది గుర్తు పెట్టుకోండి.. వచ్చే ఎన్నికల్లోనూ అదే జరుగుతుంది.. జగనన్న వన్స్ మోర్ అంటూ ఏపీ ప్రజలంతా నినాదాలు చేస్తున్నారు అని మంత్రి రోజా వెల్లడించారు.
భోగి మంటల్లో పలు జీవో కాపీలను తగులబెట్టిన చంద్రబాబు- పవన్ కళ్యాణ్..
అమరావత రాజధాని ప్రాంతంలోని మందడం గ్రామంలో భోగి మంటల కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడితో పాటు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ భోగి సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ,చంద్రబాబు నాయుడు అడ్డ పంచె కట్టుకుని సంప్రదాయబద్దంగా కార్యక్రమానికి హాజరు అయ్యారు. ఇక, భోగి మంటలు అంటించిన తర్వాత ఏపీలోని వివిధ సమస్యల చిత్రపటాలు, జీవో కాపీలను చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మంటల్లో తగులబెట్టారు. అలాగే, టీడీపీ, జనసేన జెండా గుర్తులతో సహా మహిళలు వేసిన ముగ్గులను ఇరువురు పరిశీలించారు. ఇక, రాష్ట్రంలో నాలుగున్నర ఏళ్లుగా జగన్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాల జీవో కాపీలను టీడీపీ- జనసేన నేతలు భోగి మంటల్లో దహనం చేశారు. కాగా మూడు రోజుల పాటు ‘రా కదలిరా’ కార్యక్రమానికి టీడీపీ, జనసేన పార్టీలు పిలుపు నిచ్చాయి. అలాగే, గుంటూరు జిల్లాలోని టీడీపీ పార్టీ ఆఫీసు దగ్గర తెలుగు యువత ఆధ్వర్యంలో భోగి మంటల వేడుకలు సాగాయి. ‘కీడు తొలగాలి… ఏపీ వెలగాలి’ అనే పేరుతో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ పాలనలో ఇచ్చిన జీవోలను భోగి మంటల్లో కాల్చి వేశారు. అలాగే వైసీపీ మ్యానిఫెస్టో పేపర్లను సైతం టీడీపీ నేతలు తగలబెట్టారు.
హైదరాబాద్ -విజయవాడ హైవే.. ఈ రూట్లలో వెళ్తే పండగ తర్వాతే ఇంటికి..
రెండు తెలుగు రాష్ట్రాలు సంక్రాంతి శోభతో కళకళలాడుతున్నాయి. ఉపాధి నిమిత్తం సొంత ఊరు వదిలి వెళ్లేవారు, ఎక్కడో ఉంటున్న వారు సంక్రాంతి పండుగకే సొంత ఊరు చేరుకుంటారు. తల్లిదండ్రులు, స్నేహితులతో కలిసి ఆనందంగా పండుగ జరుపుకుంటారు. ఏడాదికి సరిపడా జ్ఞాపకాలను వదిలి తిరుగు ప్రయాణం చేస్తారు. సంక్రాంతి సందర్భంగా బస్సులు, రైళ్ల రద్దీ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీన్ని దృష్టిలో పెట్టుకునే కొందరు పండుగకు రెండు, మూడు నెలల ముందే టిక్కెట్లు బుక్ చేసుకుంటారు. సంక్రాంతి సందర్భంగా రోడ్లు, టోల్ ప్లాజాలు గ్రామస్తులతో కిటకిటలాడాయి. సంక్రాంతి సందర్బంగా భాగ్యనగరంలో మకాం వేసిన ఆంధ్రా ప్రజలు స్వగ్రామాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో రెండు రోజులుగా రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. రైల్వేలో ముందస్తు రిజర్వేషన్లు కూడా అందుబాటులో లేవు. అంతేకాదు తెలంగాణలో బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఉండడంతో చాలామంది మహిళలు బస్సుల్లో ప్రయాణించేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ప్రయివేటు బస్సుల్లో కూడా రద్దీ పెరిగింది.
హైదరాబాద్ మెట్రో గుడ్ న్యూస్.. నేడు, రేపు అన్ లిమిటెడ్ ఆఫర్
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. ఈ సందర్భంగా చాలా మంది నగరాల నుంచి గ్రామాలకు వెళుతున్నారు. ఈ సమయంలో గ్రామాల నుంచి పట్టణానికి కూడా వస్తుంటారు. సంక్రాంతి సెలవులను నగరంలో గడిపేందుకు చాలా మంది నగరాలకు వెళుతుంటారు. అదే సమయంలో, వివిధ సంస్థలు మరియు కంపెనీలు అనేక ఆఫర్లను ప్రకటిస్తాయి. ప్రజలు ఆనందించడానికి నగరాలు వివిధ ఆఫర్‌లు మరియు తగ్గింపులను ప్రకటిస్తాయి. తాజాగా హైదరాబాద్ మెట్రో కార్పొరేషన్ కూడా నగర వాసులకు శుభవార్త అందించింది. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీంతో నగరవాసుల సమయం వృథా అవుతుంది. అలాగే, కిక్కిరిసిన జనాలు మరియు విపరీతమైన ట్రాఫిక్‌తో చాలా మంది చికాకు మరియు అసహనం వ్యక్తం చేస్తారు. ఈ ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలి. మెట్రో రైళ్లు. ఇది ప్రారంభమైనప్పటి నుండి, ఇది చాలా తక్కువ సమయంలో నగరం యొక్క ఒక చివర నుండి మరొక చివరకి చేరుకుంటుంది. మెట్రో సంస్థ ప్రయాణికులకు అనేక సౌకర్యాలు కల్పిస్తోంది.
నేడు మణిపూర్ నుంచి భారత్ జోడో న్యాయ్ యాత్రను ప్రారంభించనున్న రాహుల్ గాంధీ
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆదివారం (జనవరి 14) ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ను ప్రారంభించనున్నారు. ఈ యాత్ర మణిపూర్‌లోని తౌబాల్ జిల్లా నుంచి ప్రారంభమై ముంబైకి చేరుకుంటుంది. ఈ సమయంలో రాహుల్ గాంధీ 6000 కిలోమీటర్లకు పైగా ప్రయాణించనున్నారు. ఈ ప్రయాణం రెండు నెలల పాటు సాగుతుంది. రాహుల్ గాంధీ 60 నుంచి 70 మందితో కాలినడకన, బస్సులో ప్రయాణించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు మణిపూర్‌లోని ఖోంగ్‌జోమ్ వార్ మెమోరియల్ నుంచి యాత్ర ప్రారంభమవుతుంది. అయితే, ముందుగా రాజధాని ఇంఫాల్ నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. మణిపూర్ కాంగ్రెస్ అధ్యక్షుడు కీశం మేఘచంద్ర మాట్లాడుతూ, “భారత్ జోడో న్యాయ్ యాత్రను ఫ్లాగ్ ఆఫ్ చేయడానికి ఇంఫాల్‌లోని హప్తా కాంగ్జిబంగ్ పబ్లిక్ గ్రౌండ్‌ను అనుమతించాలని మేము జనవరి 2 న రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించాము. యాత్ర ఇంఫాల్ నుండి ప్రారంభమై ముంబైతో ముగుస్తుందని మేము ప్రకటించాము. జనవరి 10న ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్‌ను కలిశామని ఆయన చెప్పారు. పరిమిత సంఖ్యలో పాల్గొనేవారితో యాత్ర కోసం కాంగ్జిబంగ్ మైదానానికి వెళ్లడానికి Hapt అనుమతిని కోరింది. కానీ వారు అనుమతి నిరాకరించారు. మణిపూర్‌లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే భారత్ జోడో న్యాయ యాత్రను జెండా ఊపి ప్రారంభించనున్నారు.
ఆర్థిక మంత్రిత్వ శాఖ కఠిన చర్యలు.. విదేశాల నుంచి నడుస్తున్న క్రిప్టో ఎక్స్ఛేంజీలపై నిషేధం
బిట్‌కాయిన్‌లో ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఇటిఎఫ్) అమెరికాలో ఆమోదించబడింది. కానీ, భారత ప్రభుత్వం మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంది. విదేశాల నుంచి నడుస్తున్న క్రిప్టో ఎక్స్ఛేంజీలపై ప్రభుత్వం ఎట్టకేలకు కఠిన చర్యలు తీసుకుంది. ఇప్పుడు Binance, Kucoin, OKX వంటి క్రిప్టో ప్లాట్‌ఫారమ్‌ల వెబ్‌సైట్‌లు భారతదేశంలో నిషేధించబడ్డాయి. మనీలాండరింగ్ చట్టాలను పాటించకుండా ఈ క్రిప్టో ప్లాట్‌ఫారమ్‌లు భారతదేశంలో పనిచేస్తున్నాయని ప్రభుత్వం ఆరోపిస్తోంది. దీని వల్ల భారత ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం సుమారు రూ.3000 కోట్ల నష్టం వాటిల్లుతోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్ శక్తికాంత దాస్ గురువారం నాడు అటువంటి చర్య గురించి సూచన చేశారు. క్రిప్టో పట్ల సెంట్రల్ బ్యాంక్ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. క్రిప్టోకరెన్సీకి సంబంధించి ఎక్కడేం జరుగుతుందో మాకు అర్థం కావడం లేదు. ప్రజలు క్రిప్టోను అనుసరిస్తే వారు ప్రమాదాలను ఎదుర్కోవలసి ఉంటుంది. తులిప్ మానియాను ఉదాహరణగా చూపుతూ, క్రిప్టో మానియాను ప్రపంచం, అభివృద్ధి చెందుతున్న మార్కెట్లు తట్టుకోలేవని నేను అనుకోను అని గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. నిజానికి, 17వ శతాబ్దంలో డచ్ తులిప్‌ల ధరల్లో విపరీతమైన పెరుగుదల ఉంది. ఇది చరిత్రలో అత్యంత దారుణమైన ధర హెచ్చుతగ్గులుగా గుర్తుండిపోతుంది. క్రిప్టో కరెన్సీ ఈ టెక్నాలజీపై పనిచేస్తుంది.
అఫ్గానిస్థాన్‌తో రెండో టీ20.. సిరీస్‌పై కన్నేసిన భారత్! కళ్లన్నీ కోహ్లీపైనే
మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా నేడు భారత్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. మొదటి టీ20లో గెలిచిన రోహిత్ సేన.. సిరీస్‌పై కన్నేసింది. రెండో టీ20లో గెలిచి మరో మ్యాచ్ ఉండగానే.. సిరీస్ పట్టేయాలని చూస్తోంది. ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో రాత్రి 7 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్, చిన్న బౌండరీలు ఉండడంతో హోల్కర్ స్టేడియంలో పరుగుల వరద ఖాయం. స్పోర్ట్స్ 18, జియో సినిమాలో ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. భారత తుది జట్టులో స్వల్ప మార్పులు జరగనున్నాయి. గత మ్యాచ్ ఆడని స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ నేడు బరిలోకి దిగుతున్నాడు. 2022లో టీ20 ఫార్మాట్లో జరిగిన ఆసియా కప్‌లో అఫ్గాన్‌పైనే సెంచరీతో సుదీర్ఘ సెంచరీ నిరీక్షణకు విరాట్ ముగింపు పలికిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి అదే జట్టుపై రాణించి.. టీ20 జట్టులో తన ఎంపిక సరైందేనని చాటాలని ఉవ్విళ్లూరుతున్నాడు. విరాట్ రాకతో హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మ బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశం ఉంది. తొలి టీ20లో రోహిత్ శర్మ కెప్టెన్సీతో ఆకట్టుకున్నా.. బ్యాటింగ్‌లో పరుగులు చేయలేకపోయాడు. దాంతో రోహిత్, కోహ్లీపైనే అందరి దృష్టి నెలకొంది.
‘నా సామిరంగ’ ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?
కింగ్ నాగార్జున హీరోగా, నృత్య దర్శకుడు విజయ్ బిన్నీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘నా సామిరంగ’. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ సినిమాలో ఆషికా రంగనాథ్ హీరోయిన్‌గా నటించారు. అల్లరి నరేశ్, రాజ్ తరుణ్, మిర్నా మీనన్, రుక్సార్ థిల్లాన్ కీలక పాత్రలు పోషించారు. భారీ తారాగణం ఉన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి. సంక్రాంతి కానుకగా నా సామిరంగ చిత్రం నేడు ప్రేక్షల ముందుకు వచ్చింది. ఇప్పటికే నా సామిరంగ సినిమా ప్రీమియర్ షోస్ పడ్డాయి. సినిమా చూసిన, చూస్తున్న వారు తమతమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. నా సామిరంగ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ‘ఫస్ట్ ఆఫ్ బాగుంది. నాగార్జున సీన్స్ బాగున్నాయి’, ‘బ్లాక్ బస్టర్ బొమ్మ. సంక్రాంతి అంటే కింగే ఫైనల్ అయ్యేలా ఫిక్స్ చేశారు సర్’, ‘సంక్రాంతి బ్లాక్ బస్టర్. కింగ్ లుక్, బ్యాగ్రౌండ్ బాగున్నాయి’ అని ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.