పల్నాడు జిల్లా సత్తనపల్లి గాంధీ బొమ్మల సెంటర్లో మంత్రి అంబటి రాంబాబు అధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సంక్రాంతి వేడుకలకు ప్రజలు భారీగా హాజరు అయ్యారు. భోగి వేడుకలలో భాగంగా మంత్రి అంబటి రాంబాబు ప్రత్యేక డాన్స్ చేశాడు. అయితే, మంత్రి అంబటి రాంబాబు గత నాలుగైదు ఏళ్ల నుంచి భోగి మంటల దగ్గర సందడి చేస్తున్నారు. బంజారా మహిళలతో కలిసి హుషారుగా స్టెప్పులు వేస్తున్నారు. గత ఏడాది మంత్రి వేసిన స్టెప్పులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ సందర్భంగా మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. నేను సంక్రాంతి వేడుకలు చేస్తుంటే అందరూ సంబరాల రాంబాబు అంటున్నారు.. సంక్రాంతికి నేను సంబరాల రాంబాబునే.. సంక్రాంతి దాడితే నేను పొలిటికల్ రాంబాబుని.. సంబరాలు ఎంత సంబరంగా చేస్తానో.. రాజకీయాలు అంత సీరియస్ గా చేస్తాను.. సత్తెనపల్లిలో ప్రతి కుటుంబం సంక్రాంతి వేడుకలు జరుపుకోవాలి అన్నదే నా ఆలోచన అని ఆయన పేర్కొన్నారు.