తూర్పు లడఖ్‌లో చైనాతో సరిహద్దు వివాదం కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే మాట్లాడుతూ.. భారత సైన్యం తన సరిహద్దుల్లో పూర్తిగా సిద్ధంగా ఉందని తెలిపారు. దేశ ప్రాదేశిక సమగ్రతను అన్నివిధాలా రక్షించడానికి సిద్ధంగా ఉందని చెప్పారు. ఆర్మీ డే సందర్భంగా భారత సైన్యం ఎలాంటి భద్రతాపరమైన ముప్పును అయినా సంకల్పం, నిబద్ధతతో ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందన్నారు. తూర్పు లడఖ్‌లో చైనాతో మూడేళ్లుగా కొనసాగుతున్న ప్రతిష్టంభన నేపథ్యంలో ఆర్మీ చీఫ్ ఈ ప్రకటన చేశారు. సైన్యంలోని ప్రతి సైనికుడు దేశ భద్రత కోసం ఎలాంటి ముప్పు వచ్చినా ఎదుర్కోవడానికి కట్టుబడి ఉంటాడు అని ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే వెల్లడించారు.
Read Also: Sodhara Movie : న్యూ స్టైలిష్ లుక్ లో సోదరా హీరో సంజోష్
మేము సరిహద్దులపై బలమైన నిఘాతో పాటు భద్రతాను కొనసాగిస్తున్నామని ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే తెలిపరాు. అలాగే, మా ప్రాదేశిక సమగ్రత కోసం ఎంతకైనా తెగించటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు.. ఈ సందర్భంగా పాకిస్తాన్ పేరు చెప్పకుండానే.. జమ్మూ కాశ్మీర్‌లో ఇతర భద్రతా దళాలతో పాటు భారత సైన్యం పటిష్టంగా గస్తీ కాస్తుందని తెలిపారు. కాగా, ఇవాళ ఆర్మీ డే పరేడ్ లక్నోలో జరగనుంది. భారత తొలి కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ ఆర్మీ ఫీల్డ్ మార్షల్ కేఎం కరియప్ప సాధించిన విజయాల జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం జనవరి 15న ఆర్మీ డే జరుపుతారు. కేఎం కరియప్ప 1949లో బ్రిటీష్ చివరి కమాండర్-ఇన్-చీఫ్ జనరల్ ఫ్రాన్సిస్ రాయ్ బుట్చేర్ నుంచి భారత సైన్యానికి నాయకత్వం వహించారు. అలాగే, స్వాతంత్ర్యం తర్వాత భారత సైన్యానికి మొదటి కమాండర్-ఇన్-చీఫ్ గా కేఎం కరియప్ప ఉన్నారు.