Fish Meat: ల్యాబ్ లో చేప మాంసం ఉత్పత్తి.. దేశంలోనే తొలి ప్రాజెక్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశంలోనే తొలిసారి ప్రయోగశాలలో చేప మాంసాన్ని ఉత్పత్తి చేయడానికి సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ( CMFRI) ఒక కీలక ప్రాజెక్ట్ చేపట్టింది. సీఫుడ్‌కు గిరాకీ పెరుగుతున్న నేపథ్యంలో దానికి అనుగుణంగా సరఫరాను పెంచడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం.. దాని ద్వారా సముద్రజీవుల సమతౌల్యాన్ని కూడా సంరక్షించొచ్చని సీఎంఎఫ్‌ఆర్‌ఐ తెలిపింది. ఇక, చేపల నుంచి వేరు చేసిన కణాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ల్యాబ్‌లో డెవలప్ చేసి మాంసాన్ని ఉత్పత్తి చేస్తున్నట్లు ప్రకటించింది. దీని రంగు, రుచి, పోషకాలు నిజమైన చేపని పోలి ఉంటాయని తెలిపింది. అయితే, తొలి దశలో కింగ్ ఫిష్, చందువా చేప, వంజరం మాంసాన్ని అభివృద్ధి చేస్తామని సీఎంఎఫ్‌ఆర్‌ఐ తెలిపింది. ఈ ప్రాజెక్టును ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో చేపట్టనున్నాట్లు ప్రకటించింది. కృత్రిమ మాంసం తయారీ అంకుర సంస్థ నీట్ మీట్ బయోటెక్‌తో చేతులు కలిపినట్లు వెల్లడించింది.
Read Also: Bode Prasad: టీడీపీ-జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి.. ఆ దిశగా కృషి చేయాలి..
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
అయితే, ఇరు సంస్థలు కలిసి అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నామని సీఎంఎఫ్‌ఆర్‌ఐ వివరించింది. ఈ ఒప్పందం ప్రకారం.. అధిక విలువ కలిగిన సముద్ర చేప జాతుల ప్రారంభ సెల్‌లైన్ డెవలప్మెంట్ పై సీఎంఎఫ్‌ఆర్‌ఐ పరిశోధన చేస్తున్న్లు చెప్పుకొచ్చింది. ఆ తర్వాత పరిశోధన, అభివృద్ధి కోసం చేప కణాలను వేరు చేసి పెంపకం చేపడుతున్నట్లు చెప్పింది. జన్యు, జీవ రసాయనపరమైన అంశాలను విశ్లేషిస్తుందని సీఎంఎఫ్‌ఆర్‌ఐ ప్రకటించింది. ఈ మేరకు ఇన్‌స్టిట్యూట్‌లో ప్రాథమిక సౌకర్యాలతో సెల్ కల్చర్ లేబొరేటరీని ఇప్పటికే ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. మరోవైపు సెల్ కల్చర్ టెక్నాలజీలో నైపుణ్యం ఉన్న నీట్ మీట్, సెల్ గ్రోత్ మీడియా ఆప్టిమైజేషన్, సెల్ అటాచ్‌మెంట్ బయోరియాక్టర్ల ద్వారా ఉత్పత్తి లాంటి కార్యకలాపాలను చేపడుతున్నట్లు సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ చెప్పుకొచ్చింది.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!