సరిహద్దు సమస్య పరిష్కారానికి భారత్- నేపాల్ దేశాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనాలని ఆ దేశ విదేశాంగ మంత్రి ఎన్‌పి సౌద్ తెలిపారు. సరిహద్దు సమస్యను రాజకీయ ఏకాభిప్రాయంతో పరిష్కరించుకోవాలి.. నేపాల్-ఇండియా హ్యూమన్ డెవలప్‌మెంట్ అండ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఇందుకు సంబంధించి జాయింట్ టెక్నికల్ కమిటీ కూడా ఉందన్నారు. దీంతో రెండు దేశాల నాయకులు వాస్తవాల ఆధారంగా దౌత్యపరంగా ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలి అని నేపాల్ విదేశాంగ మంత్రి ఎన్‌పీ సౌద్ పేర్కొన్నారు.
Read Also: Realme 12Pro Launch: రియల్ మీ నుంచి మరో బడ్జెట్ ఫోన్.. ధర ఎంతంటే?
ఇక, ప్రస్తుతం ఉన్న ఆర్థిక సమస్యలను పరిష్కరించడానికి మనం మరింత జలవిద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని నేపాల్ విదేశాంగ మంత్రి ఎన్‌పీ సౌద్ పేర్కొన్నారు. భారతదేశం- బంగ్లాదేశ్‌తో విద్యుత్ వాణిజ్యాన్ని పెంచుకోవాలని ఆయన సూచించారు.. నేపాల్- భారతదేశం ఇటీవల ఒక ఒప్పందంపై సంతకం చేశాయి.. దీని కింద వచ్చే పదేళ్లలో నేపాల్ నుంచి 10 వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేసేందుకు భారత్ అంగీకరించిందన్నారు. నేపాల్- భారతదేశం మధ్య సరిహద్దు సమస్యను రెండు దేశాల మధ్య పెద్ద రాజకీయ సమస్యగా మార్చకుండా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఓ కార్యక్రమంలో పాల్గొన్న సౌద్ ఈ వ్యాఖ్యలు చేశారు.
అయితే, నేపాల్- భారతదేశం మధ్య 1,800 కిలోమీటర్ల కంటే ఎక్కువ బహిరంగ సరిహద్దు ఉన్నందున.. రెండు పొరుగు దేశాల మధ్య సరిహద్దుకు సంబంధించిన కొన్ని వివాదాలు- వాదోపవాదాలు అనివార్యమని నేపాల్ విదేశాంగ మంత్రి ఎన్‌పీ సౌద్ అన్నారు. కానీ రెండు దేశాల జాయింట్ టెక్నికల్ కమిటీ చాలా వివాదాలను పరిష్కరించింది. సుస్తా- కాలాపానీ- లిపులేఖ్ అనే రెండు సరిహద్దు పాయింట్లు మాత్రమే పరిష్కరించాల్సిన అవసరం ఉంది అని ఆయన ప్రకటించారు.