త్తరాఖండ్‌లోని హల్ద్వానీలో చోటు చేసుకున్న హింస ఇప్పుడు రాష్ట్రంలోని ట్రాఫిక్ వ్యవస్థపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో చాలా చోట్ల బస్సులను రద్దు చేయగా.. మరి కొన్ని ప్రాంతాల్లో బస్సులను ఇతర మార్గాలకు మళ్లించారు.
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లోని నాగోబా క్షేత్రంలో అంగకంగ వైభవంగా జాతర ప్రారంభమైంది. నాగ శేషుడుని పూజించే ఈ నాగోబా జాతర గంగాజలాభిషేకంతో శ్రీకారం చుట్టారు.
నేటి నుంచి కేసీఆర్ రంగంలోకి దిగుతున్నారని బీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నారు. ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ తొలిసారిగా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడంపై ప్రజలలో ఆసక్తి నెలకొంది.
తెలంగాణ ప్రభుత్వం నేడు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనుంది. ఉదయం 9 గంటలకు రాష్ట్ర కేబినెట్ సమావేశం కానుంది. ఈ మీటింగ్ లోనే.. బడ్జెట్ కు మంత్రి మండలి ఆమోద ముద్ర వేయనుంది. ఈ సారి సుమారు 2.72 లక్షల కోట్ల రూపాయలతో బడ్జెట్‌ను ప్రతిపాదించే ఛాన్స్ ఉంది.
నెల్లూరు జిల్లా కావలి ముసునూరు టోల్ ప్లాజా దగ్గర శుక్రవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురుగా వస్తున్న ప్రైవేట్ బస్సును లారీ ఢీ కొట్టడంతో.. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా.. 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.
ఒక విజన్ లా ఉండాల్సిన గవర్నర్ ప్రసంగం అందరినీ నిరాశపరిచింది అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. వచ్చే ఏడాది ప్రభుత్వం ఏ చేస్తుందొ గవర్నర్ ప్రసంగంలో ఉండాలన్నారు. ఆసరా పెన్షన్ , మహిళలకు 2500 ఎప్పుడు ఇస్తామో తెలపనీ ప్రసంగం నిరాశ పరిచింది..
హరీశ్ రావు బీఏసీ సమావేశానికి రావడంతో మంత్రి శ్రీధర్ బాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయంపై స్పీకర్ దృష్టికి కేసీఅర్ దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన చెప్పారు. లెటర్ కేసీఆర్ నుంచి రావాలి కదా.. లెటర్ ఇవ్వకుండా అనుమతి ఇచ్చేది లేదు..ఈ ప్రతిపాదనకు తాము అంగీకరించలేదని శ్రీధర్ బాబు పేర్కొన్నారు.
టీఎస్పీఎస్సీ ఛైర్మన్ మహేందర్ రెడ్డిని తప్పించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాట్లాడటం.. టీడీపీలో పని చేసిన పాల్వాయి రజినినీ ఎలా నియమించారు.. ఆంధ్ర వ్యక్తి నియమించారని మాట్లాడటం చూస్తుంటే.. దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది అని మంత్రి కొండా సురేఖ అన్నారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను ఛాంబర్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ లు కలిశారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ కు ఛాంబర్ కేటాయింపు అంశాన్ని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే, నియోజకవర్గాలలో ఓడిన కాంగ్రెస్ అభ్యర్థులు ప్రోటోకాల్ ఉల్లంగిస్తున్నారు.. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
హైదరాబాద్ నగరంలో దారుణం చోటు చేసుకుంది. యూసుఫ్ గూడలోని లక్ష్మీనరసింహనగర్ లో అర్ధరాత్రి హత్య జరిగింది. పాలమూరుకు చెందిన సింగోటం రాము అనే వ్యక్తి మర్మాంగాలతో పాటు గొంతు కోసి అతి కిరాతకంగా మర్డర్ చేశారు.