BAC Meeting: తెలంగాణ అసెంబ్లీలోని స్పీకర్ ఛాంబర్ లో బీఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పాల్గొనగా.. బీఆర్ఎస్ నుంచి కడియం శ్రీహరి, ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్ ఓవైసీ, బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డి, సీపీఐ నుంచి కూనమనేని సాంబశివరావు హాజరు అయ్యారు. అయితే, ఈ సమావేశానికి కేసీఅర్ తరపున బీఏసీ సమావేశానికి హాజరు అయ్యేందుకు మాజీ మంత్రి హరీశ్ రావు వెళ్లారు.
Read Also: Vyooham : వ్యూహం సినిమాకు తొలగిన సెన్సార్ అడ్డంకులు
అయితే, హరీశ్ రావు బీఏసీ సమావేశానికి రావడంతో మంత్రి శ్రీధర్ బాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయంపై స్పీకర్ దృష్టికి కేసీఅర్ దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన చెప్పారు. లెటర్ కేసీఆర్ నుంచి రావాలి కదా.. లెటర్ ఇవ్వకుండా అనుమతి ఇచ్చేది లేదు..ఈ ప్రతిపాదనకు తాము అంగీకరించలేదని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. దీంతో సమావేశం ప్రారంభంలోనే హరీశ్ రావు బయటకు వచ్చేశారు. దీంతో కేసీఆర్ స్థానంలో కడియం శ్రీహరి పాల్గొన్నారు.
Read Also: CM Jagan Delhi Tour: హస్తినలో పొలిటికల్ హీట్.. నేడు ఢిల్లీకి సీఎం జగన్
ఇక, హరీశ్ రావు మాట్లాడుతూ.. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అనుమతితోనే నేను బీఏసీ సమావేశానికి వెళ్ళాను అన్నారు. కానీ నేను BAC సమావేశంకు హాజరు కావడంపై అధికార పార్టీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.. గతంలో ఇతర పార్టీల ఎమ్మెల్యేలు బీఏసీకి రానప్పుడు.. ఇతరులు వచ్చిన సంప్రదాయం ఉంది అని గుర్తు చేశా.. అలాగే, గతంలో ఐదుగురు ఎమ్మెల్యేలు ఉంటేనే బీఏసీకి ఆహ్వానం ఉండేదన్నారు. కానీ ఇవాళ ఒక్క సభ్యుడు ఉన్న సీపీఐకి BACకి పిలిచారు.. నేను బీఏసీకి రావడంపై అభ్యంతరం వ్యక్తం చేయడం మీ విజ్ఞతకు వదిలి వేస్తున్నాను అని BAC సమావేశం నుంచి బయటకు వచ్చాను అని హరీశ్ రావు వెల్లడించారు.