ఉత్తరప్రదేశ్‌లోని మధురలోని యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మధురలోని యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై 40 మందితో ప్రయాణిస్తున్న బస్సును కారు ఢీకొట్టడంతో ఐదుగురు సజీవదహనం అయ్యారు.
తమిళనాడు ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగ ప్రతులను రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి పక్కన పెట్టారు. నేటి ఉదయం 10 గంటలకు ప్రసంగం మొదలు పెట్టిన ఆయన రెండు నిముషాల్లోనే తన ప్రసంగాన్ని పూర్తి చేశారు.
జమ్మూ కాశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ మారుమూల గ్రామంలో ఇవాళ తెల్లవారు జామున ఇంటికి మంటలు అంటుకోవడంతో ముగ్గురు మైనర్ బాలికలు సజీవదహనం అయ్యారని పోలీసు అధికారులు తెలిపారు.
అమెరికా అధ్యక్ష పదవి కోసం తన సొంత రిపబ్లికన్ పార్టీలోనే ప్రత్యర్థిగా ఉన్న ఇండో-అమెరికన్ నిక్కి హేలిపై మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యంగ్యంగా విమర్శలు గుప్పించాడు. విదేశాల్లో ఉన్న ఆమె మిలటరీ భర్త వెంట లేకపోవడాన్ని ప్రస్తావిస్తూ హేలి ఇంతకీ నీ భర్త ఎక్కడ? ఉన్నాడని ఎగతాళి చేశారు.
చేతబడి ద్వారా చికిత్స చేయడాన్ని నిషేధించే బిల్లుకు అస్సాం కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇలాంటి వ్యవహారాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునే బిల్లుకు హిమంత్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
‘ఢిల్లీ చలో’కు రైతులు సిద్ధమవుతున్న వేళ.. వారిని కేంద్ర ప్రభుత్వం ఇవాళ మరో దఫా చర్చలు జరిపేందుకు పిలిచింది. అన్నదాతల డిమాండ్ల పరిష్కారం దిశగా ఈ సమావేశంలో సమాలోచనలు జరిగే ఛాన్స్ ఉంది.