తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను ఛాంబర్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ లు కలిశారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ కు ఛాంబర్ కేటాయింపు అంశాన్ని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే, నియోజకవర్గాలలో ఓడిన కాంగ్రెస్ అభ్యర్థులు ప్రోటోకాల్ ఉల్లంగిస్తున్నారు.. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక, దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఈరోజు మా పార్టీకీ చెందిన 39 ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలందరం స్పీకర్ ను కలిశామన్నారు. అసెంబ్లీలో లీడర్ ఆఫ్ అపోజిషన్ ఛాంబర్ గతంలో నుంచి అదే ఛాంబర్ ఇస్తున్నారు.. ఇప్పుడు LOPకి ఇచ్చిన ఛాంబర్ స్పీకర్ కు కావాలని అడగడంతో ఇచ్చాం.. స్పీకర్ మీదా గౌరవంతో ఇవ్వడం జరిగింది అని ఆయన పేర్కొన్నారు.
Read Also: RBI : గుడ్ న్యూస్.. ఇకపై లోన్ తీసుకుంటే ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సిన పనిలేదు
అయితే, మా LOPకి అదే స్థాయిలో ఛాంబర్ ఇస్తామని చెప్పి.. ఇప్పుడు చిన్న రూమ్ కేటాయించారు అదీ కరెక్ట్ కాదు అని ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఒకే ఒక రూం LOPకి ఇచ్చారు.. ఇప్పటి వరకు వాడుతున్న LOP రూంని మీ సౌకర్యం కోసం ఇవ్వడానికి కేసీఆర్ ఒప్పుకున్నారు.. కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఐదుగురు ఉన్నప్పుడు కూడా మేము LOP రూమ్ ఇచ్చాం.. ఇప్పుడు మా LOPకీ ఇచ్చిన రూమ్ విషయంలో మరోసారి ఆలోచించి ఛాంబర్ కేటాయించాలని స్పీకర్ ని కోరామని ఆయన పేర్కొన్నారు. చాలా అవమానకరంగా చిన్న రూం ఇచ్చారు.. మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచిన దగ్గర ప్రోటో కాల్ ఉల్లంఘనలు జరుగుతున్నాయి.. దీనిపైన కూడా స్పీకర్ కి ఫిర్యాదు చేశాం.. సంగారెడ్డిలో చింతా ప్రభాకర్ ఎమ్మెల్యే అనే విషయం ప్రజలు మర్చిపోతున్నారు.. ఓడిన ఎమ్మెల్యే భార్యకి ప్రోటోకాల్ ఇస్తున్నారు.. స్థానిక ఆర్డీవో కూడా అలానే చేస్తున్నారు.. ఆర్డీవో మీదా ఫిర్యాదు చేశాం.. ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు పోలీస్ ఎస్కార్ట్ వెహికల్ ఇస్తున్నారు.. దీనిపై డీజీపీ మరోసారి ఆలోచించాలి.. ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు వస్తారు పోతారు అని వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.