ఇవాళ తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు పునః ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా వేడి వాడిగా చర్చ జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా నేటి అసెంబ్లీలో మొదట సంతాప తీర్మానం పెట్టనున్నారు. ఆ తర్వాత బడ్జెట్ పై చర్చ జరుగుతుంది.
ఈ బడ్జెట్ లో ఆరు గ్యారంటీలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇచ్చింది. అందులో భాగంగానే పెద్ద ఎత్తున నిధులను ప్రభుత్వం కేటాయించింది. ఇప్పటికే రెండు పథకాలను అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. మరో రెండు పథకాలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తుంది.
తెలంగాణ అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను శాసనసభలో రూ. 2.75 లక్షల కోట్లతో డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశ పెట్టారు. బడ్జెట్ లోని ముఖ్యాంశాలు..
ఎన్నికలకు ముందు నంద్యాల జిల్లా బనగానపల్లె నరియోజకవర్గంలో నివురుగప్పిన నిస్పులా సెగలు కక్కుతున్న రాజకీయం ఇప్పుడు మంటలు పుట్టిస్తొంది.. షాదీఖానా నిర్మాణం విషయంలో ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డికి మద్య జరుగుతున్న వార్ పీక్స్కు చేరింది.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు నేడు చివరి రోజు.. అయోధ్యలో రామమందిర నిర్మాణంపై లోక్సభలో చర్చ జరగనుంది. జనవరి 22న జరగనున్న రామ్లల్లా ప్రతిష్ఠాపన కార్యక్రమంపై చర్చతో 17వ లోక్సభ ఈరోజుతో ముగియనుంది.
అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ ప్రైమరీ ఎన్నికల్లో మరోసారి దూసుకుపోయారు. మరో రాష్ట్రంలో విజయం సాధించి తన ఖాతాలో వేసుకున్నారు.
పాక్ మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ ఏఐ ఆధారిత విక్టరీ స్పీచ్ ను రిలీజ్ చేశారు. ఈ ప్రసంగంలో ఆయన పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ అధినేత నవాజ్ షరీఫ్ లండన్ ప్లాన్ ఫెయిల్ అయిందన్నారు.
తమిళనాడులో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 25 ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఇవాళ తెల్లవారుజాము నుంచే ఎన్ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి.