అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ ప్రైమరీ ఎన్నికల్లో మరోసారి దూసుకుపోయారు. మరో రాష్ట్రంలో విజయం సాధించి తన ఖాతాలో వేసుకున్నారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడడానికి ట్రంప్ అవకాశాలు మెరుగు పర్చుకుంటున్నారు. గురువారం నెవడా రాష్ట్రంలో జరిగిన ప్రైమరీ ఎన్నికలో ఆయన విజయం నమోదు చేశారు.
Read Also: Bhakshak : ఓటీటీలోకి వచ్చేసిన ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్..స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
ఇక, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం డొనాల్డ్ ట్రంప్‌తో పోటీ పడుతున్న మరో నేత నిక్కీ హేలీ ఈ ఎన్నికకు దూరంగా ఉండిపోయారు. నెవడాలోని మొత్తం 26 మంది డెలిగేట్లు ట్రంప్‌కు సపోర్ట్ ఇచ్చారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచిపోవాలంటే మొత్తం 1,215 మంది డెలిగేట్ల సపోర్టు అవసరం ఉంది. ఇప్పటి వరకు ట్రంప్ 62 మంది, నిక్కీ హేలీ 17 మంది డెలిగేట్ల మద్దతును కూడగట్టుకున్నారు.