తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత గులాబీ బాస్ కేసీఆర్ తొలిసారి జనం మధ్యలోకి రాబోతున్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని మర్రిగూడ బైపాస్ రోడ్డులోని 50 ఎకరాల స్థలంలో ఇవాళ మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు రైతు గర్జన పేరుతో బీఆర్ఎస్ బహిరంగసభ నిర్వహిస్తుంది.
ఇద్దరు బందీలను కాపాడేందుకు దక్షిణ గాజాలోని రఫా సరిహద్దులో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 63 మంది పాలస్తీనియన్లు మరణించారు. ఈ విషయాన్ని రఫా ఆస్పత్రి అధికారులు పేర్కొన్నారు.
డిప్యూటీ సీఎం పదవిని రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పదవి రాజ్యాంగంలో లేనప్పటికీ.. ఎలాంటి నిబంధనను ఉల్లంఘించలేదని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.
దేశ రాజధాని ఢిల్లీలోని సాకేత్ ప్రాంతంలోని ఓ స్కూల్ కు బెదిరింపు మెయిల్ తీవ్ర కలకలం రేపుతుంది. ఈ నెల 13వ తేదీన ఆ ప్రాంతంలోని అమిటీ ఇంటర్నేషనల్ స్కూల్ను పేల్చివేస్తామంటూ బాంబు హెచ్చరికతో కూడిన మెయిల్ రావడం తీవ్ర కలకలం రేపింది.
కేరళ రాష్ట్రంలోని రేషన్ షాపుల్లో ప్రధాని నరేంద్ర మోడీ పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు సరైనవి కాదని, వీటి అమలు కష్టమని సీఎం పినరయి విజయన్ తెలిపారు.