పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పాకిస్థాన్ ముస్లిం లీగ్- నవాజ్ (PML-N) తరఫున ప్రధాని అభ్యర్థిగా తన సోదరుడు షహబాజ్ షరీఫ్‌ను ఆయన నామినేట్ చేశారు.
కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ ఇవాళ రాజస్థాన్ నుంచి రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ పత్రాలను దాఖలు చేయబోతున్నారు. నామినేషన్ దాఖలు చేసేందుకు సోనియా గాంధీ ఈరోజు ఉదయం జైపూర్ కు వస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.
హర్యానా- పంజాబ్ రాష్ట్రాల నుంచి వేలాది మంది రైతులు తమ డిమాండ్లతో ఢిల్లీకి చేరుకుంటున్నారు. అయితే, రైతులను అడ్డుకునేందుకు ఢిల్లీ సరిహద్దులను పోలీసులు మూసివేశారు. అయితే, 2020 రైతు ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించిన భారతీయ కిసాన్ యూనియన్ అధికార ప్రతినిధి రాకేష్ టికాయిత్ ఈ ఉద్యమంలో మాత్రం కనిపించడం లేదు.
మణిపూర్ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 1961 తర్వాత రాష్ట్రంలోకి వచ్చి జీవానం సాగిస్తున్న వారందరినీ గుర్తించి పంపించి వేస్తామని వెల్లడించారు.
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కేసులో ఏసీబీ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. అందులో భాగంగానే బాలకృష్ణ కేస్ లో బినామీలకు ఏసీబీ నోటీసులు జారీ చేశారు. బీనామీలుగా ఉన్న భరత్, సత్యనారాయణ, భరణికి నోటీసులు అందించారు.
వేలేరు గ్రామంలో పర్యటించిన యార్లగడ్డ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో పర్యటించిన ఆయన తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలకు చేయబోయే సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.
మహారాష్ట్రలో రాజకీయం హీటెక్కింది. ఎన్సీపీ పార్టీలో చీలికతో శరద్ పవార్ తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ నేతృత్వంలోని పార్టీని నిజమైన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీగా గుర్తిస్తూ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులను సవాలు చేస్తూ శరద్ పవార్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
పంజాబ్, హర్యానా మధ్య గల శంబు దగ్గర నుంచి రైతులు ఢిల్లీకి బయల్దేరారు.. రైతులు ట్రాక్టర్లలో వస్తుండటంతో ట్రాక్టర్ ట్రాలీలను ఢిల్లీలోకి అనుమతించేది లేదని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో పోలీసుల పైకి రైతులు రాళ్లు రువ్వాగా.. ఆ తర్వాత పోలీసులు పలుమార్లు టియర్ గ్యాస్ విడుదల చేశారు. టియర్ గ్యాస్ షెల్స్ కారణంగా రైతులు ఒక్కసారి వెనక్కి తగ్గారు.