ఉత్తరాఖండ్ రాష్ట్రంలో నైనిటాల్ జిల్లాలోని బన్‌భూల్‌పురా పట్టణంలో 'అక్రమ' మదర్సా కూల్చివేతపై హింసాత్మక ఘర్షణల నేపథ్యంలో విధించిన కర్ఫ్యూ తాత్కాలిక సడలించింది.
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో డెహ్రాడూన్ ఎయిర్‌పోర్టు విస్తరణ, మొదటి దశ కింద హెలిపోర్టుల నిర్వహణ పనులు దాదాపుగా పూర్తి అయ్యాయి. రెండో దశలో విమానాశ్రయాలు, హెలిపోర్టుల పనులు త్వరలో పూర్తి కాబోతున్నాయి.
ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాకు సహాయం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న చైనాకు చెందిన మూడు కంపెనీలపై పాటు దాదాపు రెండు డజన్ల కంపెనీలపై యూరోపియన్ యూనియన్ కొత్త వాణిజ్య ఆంక్షలను ప్రతిపాదించింది.
ఉత్తర కొరియా తన ఈశాన్య తీరప్రాంత జలాల్లో అనేక బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిందని దక్షిణ కొరియా సైన్యం తెలిపింది. కొరియా ద్వీపకల్పంలో ఇప్పటికే తీవ్ర ఉద్రిక్తతల మధ్య జనవరి నుంచి ఉత్తర కొరియాకు ఇది ఐదవ పరీక్ష జరిపినట్లు పేర్కొనింది.
తమ డిమాండ్ల సాధన కోసం రైతు సంఘాలు తలపెట్టిన ‘చలో ఢిల్లీ’ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. వరుసగా మూడో రోజు కూడా ఆందోళనలకు దిగుతామని రైతులు హెచ్చరించారు.
తాను ప్రాతినిధ్యం వహించే హుబ్లీ- ధార్వాడ్ వెస్ట్ నియోజకవర్గంలో ఇన్ఫోసిస్‌కు 58 ఎకరాల భూమి కేటాయించినా ఈ టెక్ దిగ్గజం ఒక్క ఉద్యోగం కూడా కల్పించలేదని బీజేపీ ఎమ్మెల్యే అరివింద్ బెల్లాద్ ఆరోపించారు. ఇన్ఫోసిస్‌కు కేటాయించిన భూమిని తిరిగి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. మాజీ ప్రధాన మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి మనువడు విభాకర్ శాస్త్రి ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.