Bharat Bandh: దేశవ్యాప్తంగా భారత్ బంద్.. రైలు పట్టాలపై పడుకొని రైతన్న నిరసన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Farmers protest: నేడు భారత్ బంద్‌కు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. సంయుక్తి కిసాన్ మోర్చా పిలుపు మేరకు మరో 11 డిమాండ్ల కోసం రైతులు మరోసారి ఆందోళనకు దిగారు. ఇవాళ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ భారత్ బంద్ కొనసాగనుంది. అయితే, ఈ ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీస్తుంది. పంజాబ్‌లోని చాలా చోట్ల రైతులు రైలు పట్టాలపై పడుకుంటున్నారు. రైతుల ఈ ఉద్యమం కారణంగా ఇప్పటికే రైల్వే శాఖ పలు రైళ్ల రాకపోకలను నిలిపివేసింది. పంజాబ్ లోని లూథియానా- సాహ్నేవాల్- చండీగఢ్ మార్గంలో 6 రైళ్లను దారి మళ్లించారు.
Read Also: Devara : ఎన్టీఆర్ ‘దేవర’ విడుదలపై క్లారిటీ వచ్చేది అప్పుడేనా..?
Also Read
- Telangana Bar Licences Draw : లక్కీ డ్రాలో లక్ ఎవరికో?.. రాష్ట్రంలో బార్ల కేటాయింపునకు సర్వం సిద్ధం..
- EPFO ECR Filing Deadline: వేతన పరిమితి మార్పులతో ECR ఫైలింగ్‌లో మార్పులు.. EPFO కీలక నిర్ణయం
- Nepal: చైనాను కాదని, భారత్‌కే ఓటేసిన నేపాల్ ప్రధాని..
- AP Rain Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. 4 రోజుల పాటు వర్షాలు.. పలు జిల్లాలకు పిడుగుల హెచ్చరిక
ఇక, ఈ దేశవ్యాప్త సమ్మెకు యునైటెడ్ కిసాన్ మోర్చా (SKM) పిలుపునిచ్చింది. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో పారిశ్రామిక పనులు మూసివేయాలని కోరారు. చాలా చోట్ల హైవేలపై ఆందోళనకు దిగుతున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు కార్మిక సంఘాలు భారత్ బంద్ కు మద్దతు ప్రకటించాయి. అయితే, భారత్ బంద్‌కు సంబంధించి ఢిల్లీ పోలీసులు పూర్తి ఏర్పాట్లు చేశారు. ఢిల్లీ సరిహద్దుల్లో నిఘా పెంచారు. గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలో 144 సెక్షన్ విధించడంతో పాటు సింగు, తిక్రీ, ఘాజీపూర్ సరిహద్దుల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో ట్రాఫిక్ జామ్‌తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Read Also: Karnataka: పెళ్లం ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేస్తుందని భర్త సూసైడ్..
అయితే, భారత్ బంద్ ప్రభావం మొదలైంది.. దేశంలోని చాలా చోట్ల రోడ్లు, ప్రభుత్వ కార్యాలయాల దిగ్బంధనాలు చేస్తున్నారు. పంజాబ్‌లో మూడు వేల ప్రభుత్వ బస్సుల రాకపోకలను నిలిపివేసింది. అయితే, అంబులెన్స్‌లు, పెళ్లిళ్ల వాహనాలు, పరీక్షలకు వెళ్లే విద్యార్థులకు ఈ భారత్ బంద్ నుంచి మినహాయింపు ఇచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని కోరారు. కాగా, మరోసారి ఆదివారం రైతు సంఘాలు, కేంద్ర ప్రభుత్వం మధ్య నాలుగో రౌండ్ చర్చలు జరగాల్సి ఉంది.
తాజావార్తలు
-
TVS Raider 125 Updated: TVS Raider 125 బైక్ కొత్త ఫీచర్లతో అప్డేట్.. ట్రాక్షన్ కంట్రోల్, టైప్-C ఫాస్ట్ ఛార్జింగ్!
-
Jio Recharge: యూజర్లకు జియో షాక్.. రీఛార్జ్ ధరల పెరిగే ఛాన్స్..!
-
Telangana Bar Licences Draw : లక్కీ డ్రాలో లక్ ఎవరికో?.. రాష్ట్రంలో బార్ల కేటాయింపునకు సర్వం సిద్ధం..
-
PM Modi: ఆసియా క్రీడల పతక విజేతలతో ప్రధాని మోడీ భేటీ.. భారత క్రీడాకారుల విజయాలపై ప్రశంసలు!
-
Isha Ambani: జియో పుట్టుక వెనుక అసలు కథ.. ఈషా అంబానీ చెప్పిన సీక్రెట్ స్టోరీ!
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!