Sri Sathyasai District: శ్రీ సత్యసాయి జిల్లాలో ఓ ప్రేమ జంట రాత్రిపూట హల్‌చల్ చేసింది. కదిరి పట్టణంలోని ఓ హోటల్ సమీపంలో రాత్రి 12 గంటల సమయంలో మద్యం సేవించి స్థానికులతో గొడవకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసుల సంఘటన స్థలానికి చేరుకున్న పరిస్థితిని శాంతింపజేయడానికి ప్రయత్నించగా, ఆ ప్రేమ జంట పోలీసుల పట్ల కూడా దురుసుగా ప్రవర్తించింది.
Read Also: DilRaju : సల్మాన్ ఖాన్ హీరోగా దిల్ రాజు ఫిక్స్.. డైరెక్టర్ ఇతగాడే
ఇక, తాగి హల్‌చల్ చేసిన వారు చక్రాయపేటకు చెందిన లోకేష్, బి.కొత్తకోటకు చెందిన మహిళగా పోలీసులు గుర్తించారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించారు. ఇక, వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు మద్యం సేవించినట్లు నిర్ధారించడంతో, పోలీసులు ఇరువురిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.