Delhi Metro: కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా ఆప్ నిరసన.. మెట్రో స్టేషన్లు మూసివేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఇవాళ నిరసనలకు పిలుపునిచ్చింది. దీని ప్రభావం ఢిల్లీలోని మెట్రోపై పడింది. ఇక, భద్రతా కారణాల దృష్ట్యా లోక్ కళ్యాణ్ మార్గ్ మెట్రో స్టేషన్‌లోని ప్రవేశ, నిష్క్రమణ గేట్లను మూసివేసినట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) మంగళవారం నాడు తెలిపింది. దీంతో పాటు పటేల్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్ మెట్రో స్టేషన్లు కూడా మూసివేసినట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) ట్విట్టర్ (ఎక్స్) వేదికగా తెలిపింది. ప్రయాణికులు ఇతర మార్గాల ద్వారా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని తెలిపారు.
Read Also: Mobile ReCharge: మొబైల్ యూజర్లకు బ్యాడ్న్యూస్.. పెరగనున్న రీఛార్జ్ ప్లాన్స్..
Also Read
అయితే, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ నివాసాన్ని ముట్టడిస్తామని ఆప్ నేతలు తెలిపారు. దీంతో ఢిల్లీ పోలీసులు కూడా అప్రమత్తం అయ్యారు. ఒక్కసారిగా నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తగిన ఏర్పాట్లు చేశారు. అలాగే, ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో సీఎం కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసింది. మార్చి 28వ తేదీ వరకు ఆయన ఈడీ కస్టడీలో ఉండనున్నారు.
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్‌గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!