Indian Navy: 23 మంది పాక్ సిబ్బందిని రక్షించిన ఇండియన్ నేవీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇతర దేశాల నౌకలు ప్రమాదంలో ఉన్నప్పుడు రక్షించేందుకు ఎల్లప్పుడు ముందుండే ఇండియన్ నేవీ మరోసారి సాహసం చేసింది. వాయువ్య హిందూ మహా సముద్రంలో హైజాక్ అయిన ఇరాన్ చేపల బోటుతో పాటు అందులో సిబ్బందిని కూడా రక్షించింది. కాగా, బోటులో ఉన్న వారు పాకిస్థాన్‌కు చెందిన 23 మంది సిబ్బంది అని భారత నేవీ అధికారులు తెలిపారు. సముద్రాల్లో యాంటీ పైరసీలో భాగంగా ఈ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టినట్లు వెల్లడించారు. అయితే, గల్ఫ్ ఏడెన్‌కు సమీపంలో ఉన్న సోకోట్రా ద్వీప సమూహానికి 90 నాటికల్ మైళ్ల దూరంలో గురువారం నాడు ఇరాన్ దేశానికి చెందిన చేపల బోటు హైజాక్ అయింది.
Read Also: Health Benefits : సోంపు గింజల నీటిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసా?
Also Read
ఇక, తొమ్మిది మంది సముద్ర పైరేట్స్ పడవను తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు సమాచారం రావడంతో ఆ బోటును, సిబ్బందిని రక్షించేందుకు భారత నేవీ ప్రత్యేక ఆపరేషన్ చేపడుతున్నట్లు తెలియజేసింది. మొదట ఐఎన్‌ఎస్ సుమేధా సముద్రపు దొంగల అదుపులో ఉన్న ‘ఏఐ కంబార్’ బోటును అడ్డుకుంది.. ఆ తర్వాత ఐఎన్‌ఎస్ త్రిశూల్ నౌక దానికి సహాయం చేసింది. దాదాపు 12 గంటల ప్రత్యేక ఆపరేషన్ తర్వాత బోటులో ఉన్న పైరేట్లు లొంగిపోవడంతో 23 మంది పాకిస్థాన్ జాతీయులు సేఫ్ గా బయటపడ్డట్లు నేవీ సిబ్బంది చెప్పుకొచ్చింది.
Read Also: BharatRatna : నేడు భారతరత్న అవార్డు ప్రదానోత్సవం.. దిగ్గజాలకు అందజేత
కాగా, రక్షించిన బోటును సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు భారత నేవీ ప్రత్యేక బృందాలు చర్యలు తీసుకున్నాయి. ఆ బోటు తిరిగి తన కార్యకలాపాలు కొనసాగించడానికి తనిఖీలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. దేశాలతో సంబంధం లేకుండా సముద్ర, నావికుల భద్రతకు కట్టుబడి ఉన్నట్లు భారత నేవీ ప్రకటించింది. గత కొంతకాలంగా గల్ఫ్ ఏడెన్‌లో వాణిజ్య నౌకలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. దీంతో భారత నేవీ సాహసాలు చేస్తూ పలు దేశాలకు చెందిన నౌకలకు సహాయం చేస్తుంది.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!