ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై చేవెళ్ల ఎంపీ రంజీత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చేవెళ్ల పార్లమెంట్ సెగ్మెంట్ లో ఒక్క గజం భూమిని కబ్జా చేసినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్దం అని ఓపెన్ చాలెంజ్ చేశారు.
నేడు హైదరాబాద్ నగరంలో జరిగే శ్రీ రామ నవమి శోభాయాత్ర సందర్భంగా గోషామహల్, సుల్తాన్ బజార్ ట్రాఫిక్ ఠాణా పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు.
శ్రీరామ నవమి సందర్బంగా నేడు (బుధవారం) భద్రాచల క్షేత్రం రామాలయంలో సీతారాముల కళ్యాణం వైభవంగా జరగబోతుంది. శ్రీ సీతారామల కళ్యాణం కోసం భద్రాద్రి అంగరంగ వైభవంగా ముస్తాబైంది. రామాలయంలో మూలవరులకు మొదట కళ్యాణం జరగనుంది.
శ్రీరామ నవమి వేడుకల సందర్భంగా మద్యం విక్రయాలపై పోలీసులు నిషేధం విధించారు. నేటి ఉదయం ఉదయం 6 గంటల నుంచి రేపు ( గురువారం ) ఉదయం 6 గంటల వరకు మద్యం అమ్మకాలను బంద్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
నేడు శ్రీరామనవమి శోభాయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఇవాళ ( బుధవారం ) శ్రీరామ నవమి శోభయాత్రకు అనుమతి లేదన్న లేఖను పోలీసులకు రాజాసింగ్ అందజేశారు. ఎవరు అనుమతి ఇచ్చిన ఇవ్వకున్నా శ్రీరామ నవమి శోభయాత్ర చేసి తీరుతానంటున్నారు.
కమలాపురం నియోజకవర్గంలో టీడీపీ పార్టీకి సపోర్టుగా షాకింగ్ సర్వే రిపోర్ట్ బయటకు వచ్చింది. ఈసారి రాబోయే ఎన్నికల్లో రవీంద్రనాథ్ రెడ్డి ఓటమికి తప్పదన్న ఆ సర్వే రిపోర్ట్ లో వెల్లడైందని పుత్తా ఫ్యామిలీ తెలిపింది.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 4 నెలలోనే దాదాపు సగానికి పైగా హామీలను అమలు చేస్తుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. గత 10 ఏళ్లలో కేసీఆర్ ఇచ్చిన ఎన్నీ హామీలను అమలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు..