ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై చేవెళ్ల ఎంపీ రంజీత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చేవెళ్ల పార్లమెంట్ సెగ్మెంట్ లో ఒక్క గజం భూమిని కబ్జా చేసినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్దం అని ఓపెన్ చాలెంజ్ చేశారు. నా పై చేసిన ఆరోపణలు జీవన్ రెడ్డి నిరూపిస్తే నేను కబ్జా చేసిన భూమిని మొత్తం అతనికి రిజిస్ట్రేషన్ చేయిస్తానని ప్రకటించారు. జీవన్ రెడ్డి తన స్థాయి మరచి మాట్లాతున్నాడు.. నాపై నమ్మకం పెట్టిన ప్రజలకు వాస్తవాలు తెలియాలనే నేను స్పందిస్తున్నాను.. జీవన్ రెడ్డి ఇంకొక్కసారి నిరాధారమైన ఆరోపణలు చేస్తే దాని పరిణానాలు వేరెగా ఉంటాయని రంజీత్ రెడ్డి హెచ్చరించారు.
Read Also: Elections 2024: నేటితో ముగియనున్న మొదటి విడత ఎన్నికల ప్రచారం.. ఎల్లుండే పోలింగ్..!
ఇక, మణికొండలో ఏర్పాటు చేసిన ఈది మీలాబ్ నబీలో ఎంపీ రంజీత్ రెడ్డి ముఖ్య అథిదిగా పాల్గొన్నారు. రంజాన్ తరువాత మైనారిటీ సోదరులు ఇచ్చే దావత్ లో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని అభ్యర్థించారు. సెక్యులరిజం బ్రతికించాలంటే మోడీకో హటావ్ దేశ్ కో బచావో అంటూ చేయి గుర్తుకు ఓటు వేయాలని కోరారు . ఈ సందర్భంగా చాలా మంది ముస్లిం యువకులు రంజీత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక, కార్యక్రమం తర్వాత ముస్లిం సోదరులతో కలిసి ఆయన భోజనం చేసారు.