రేవంత్ ప్రభుత్వం ఏడాది కూడా ఉండేటట్టు లేదు అని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్ భయంతో నారాయణాపేట సభలో భయంతో మాట్లాడుతున్నారు.. ఎప్పుడు ఆయన బీజేపీతో కలుస్తాడో తెలియదు అని పేర్కొన్నారు.
బీజేపీ దొందు దొందే అని మాజీమంత్రి హరీష్ రావు అన్నారు. రేవంత్ రెడ్డి డిసెంబర్ 9వ తేదీ నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు.. ఎవరికైనా అయ్యిందా..? అని ప్రశ్నించారు. రుణమాఫీ అయ్యినోళ్లు కాంగ్రెస్ కే ఓటేయండి.. కానోళ్లు మాత్రం బీఆర్ఎస్ కే ఓటేయండి అన్నారు.
కాంగ్రెస్ ఎక్కడుంటే మత కల్లోలాలు, కర్ఫ్యూలు, కరప్షన్ ఉంటుంది అని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్పారు. స్వాత్యంత్రం వచ్చాక ఒక బీసీ నాయకుడు ప్రధాని అయ్యాడు.. దేశంలో అద్భుతమైన రహదారులు వేశాం.
భద్రాచల శ్రీరామ కల్యాణం ప్రత్యక్ష ప్రసారం అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో స్క్రీనింగ్ కమిటీ ఉంది.. ఈ కమిటీ నిర్ణయం ఎలా ఉంటే అదే ఈసీఐకి నివేదించాము.. ఈసీఐ నుంచి కూడా స్పష్టత రావాల్సి ఉంది అని వికాస్ రాజ్ తెలిపారు.
నిర్మల్ జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తన అనుచరులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తల అభిప్రాయలను తెలుసుకున్నారు. ఏఎన్ రెడ్డి కాలనీలో క్లబ్ హౌజ్ లో కార్యకర్తల సమావేశం అయ్యారు. ఇక, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాలని మెజార్టీ కార్యకర్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు.
హేటిరో సంస్థకు ఇచ్చిన భూమి పై ఇప్పటి వరకు ప్రభుత్వం చర్యలు లేవు అని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిని ఆమోదిస్తున్నట్లు అర్థమవుతుంది.. వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కట్టబెట్టడం బాధాకరమన్నారు.
అధికార పార్టీ ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసే ఎత్తుగడలు చేస్తోంది అని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధికార దుర్వినియోగం చేస్తున్నారు.. ప్రతిపక్షంలో ఉండగా మాట్లాడినట్లు మాట్లాడుతున్నారు.. కేసీఆర్, కేటీఆర్ పై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు.
రేపు జరిగే శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచల శ్రీ రాముని కళ్యాణ ప్రసారాలపై ఎలక్షన్ కమిషన్ ఆంక్షలు విధించింది అని బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు.
భవన నిర్మాణ కార్మికులుగా వివిధ పనులు చేస్తూ జీవనం సాగించే సగరులు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలని గన్నవరం నియోజకవర్గ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ఆకాంక్షించారు.
రైతు బీమా తరహాలో.. గల్ఫ్ కార్మికుల బీమా అందిస్తామని ప్రకటించారు. ఇందులో గల్ఫ్ కార్మికుల ప్రమాద భీమా రూ. 5 లక్షలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇక, గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయబోతున్నట్లు పేర్కొన్నారు. ఈ విభాగానికి సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమిస్తాం అని తెలిపారు. జూన్, జులైలో పాలసీ డాక్యుమెంట్ విడుదల చేస్తామన్నారు.