ఐదేళ్లలో నియోజకవర్గాన్ని అభివృద్ధి, సంక్షేమంలో ముందు వరుసలో నిలబెట్టిన తనను గెలిపించే బాధ్యత ప్రజలదైతే.. నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసే బాధ్యత తనదని పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరు శంకరరావు అన్నారు.
తిరువూరు పట్టణంలోని 19వ వార్డులో ఎన్డీయే కూటమి అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం చేశారు. ఎన్నికల ప్రచారంలో ప్రతి ఇంటిఇంటికి తిరిగిన కొలికపూడికి మహిళలు మంగళ హారతులు, పూలమాలలతో ఘన స్వాగతం పలికారు.
మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పట్నం సునీత మహేందర్ రెడ్డి జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం నాడు పట్నం సునీత రెడ్డికి మద్దతుగా సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం నిర్వహించారు.
జలదంకి మండల నాయకత్వంలో కావలి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి దగుమాటి కృష్ణారెడ్డి సూచనలతో మాజీ సర్పంచ్ తేలపోలు పెద్ద పెంచలయ్య సారథ్యం వేములపాడు పంచాయతీకి చెందిన 10 కుటుంబాలు ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ సోదరుడు కాకర్ల సునీల్ సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
లోక్సభ ఎన్నికలు 2వ దశ ఓటింగ్ సందర్భంగా పశ్చిమ బెంగాల్లోని బాలూర్ఘాట్లో రెండు గ్రూపుల మధ్య ఘర్షణ జరిగింది. టీఎంసీ, బీజేపీ కార్యకర్తలు పరస్పరం దాడులకు దిగారు.
ఇరాన్తో వ్యాపారం చేసిన పలు కంపెనీలపై అమెరికా ఆంక్షలు విధించింది. వీటిలో మూడు భారతీయ కంపెనీలు కూడా ఉన్నాయి. ఇరాన్కు చెందిన ఆయుధాలను అక్రమంగా రష్యాకు చేరవేయడంలో సహాయం చేశారనే కారణంతో పలు కంపెనీలు, వ్యక్తులు, నౌకలపై యూఎస్ ఆంక్షల పర్వం కొనసాగిస్తుంది.