Komati Reddy Venkat Reddy: ఎన్నికల ఫలితాల తరువాత BRS భూస్థాపితం కాబోతుంది అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. పదవి పోయోందనే ఫ్రస్ట్రేషన్ లో కేటీఆర్ మాట్లాడుతున్నాడు.. ముఖ్యమంత్రిని పట్టుకుని కేటీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు.. మహిళలకు ఉచిత ప్రయాణం, ఉచిత గ్యాస్, జీరో కరెంట్ బిల్లు ఇవ్వడం తప్పా..! అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఇచ్చిన 30 వేల ఉద్యోగాలు మేమే ఇచ్చినం అని కేటీఆర్ అంటున్నాడు.. మీ ప్రభుత్వంలో ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేకపోయారంటూ మండిపడ్డారు. మీ అయ్యా ఫామ్ హౌజ్ లో పడుకుంటే నువ్వే కదా రాష్ట్రాన్ని ఫలించినవు.. అధికారం చేపట్టగానే న్యాయ చిక్కులని తొలగించి ఉద్యోగాల భర్తీ చేపట్టం అని కోమటి రెడ్డి విమర్శలు గుప్పించారు.
Read Also: Prajwal Revanna : ప్రజ్వల్ రేవణ్ణ పాస్‌పోర్ట్ రద్దు.. విదేశాంగ మంత్రిత్వ శాఖ చర్యలు
ఇక, దుర్గం చెరువు మీద ఒక కేబుల్ బ్రిడ్జ్ కట్టి అది ఇది చేశామని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి పరిశ్రమలు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ.. చంద్రబాబు అంతో ఇంతో హైటెక్ సిటీ కడితే.. కాంగ్రెస్ పరిశ్రమలు తెచ్చింది.. పరిశ్రమలు పోతున్నాయని జ్ఞానం లేకుండా కేటీఆర్ మాట్లాడుతున్నాడు.. మీ లెక్క తండ్రి పేరు చెప్పుకుని మా ముఖ్యమంత్రి రాజకీయాల్లోకి రాలేదు.. ఇండిపెండెంట్ ZPTC గా గెలిచి ప్రజల కోసం పోరాడి ఈ స్థాయికి వచ్చారు రేవంత్ అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఒకటి రెండు స్థానాల్లో మాత్రమే BRSకు డిపాజిట్ వస్తుంది.. మిగతా స్థానాల్లో డిపాజిట్ గల్లంతే.. కాంగ్రెస్ కు 12కు పైగా స్థానాలు వస్తాయి.. ఒక్క సీట్ కూడా రావడం లేదని కేటీఆర్ ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నాడని మంత్రి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.
Read Also: Viral News: స్నేహితులు ఛాలెంజ్ చేశారని చెరువులో దూకిన యువకుడు.. ఏం జరిగిందంటే..?
ఇక, రింగ్ రోడ్ ను అమ్ముకున్నారు.. ఎంత దోచుకున్నారో విచారణ చేస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. మీ మిత్ర పక్షం మోడీతో మాట్లాడి ఐటీఐఆర్ ఎందుకు తేలేదు కేటీఆర్?.. రిపేర్ చేసిన కూడా కాళేశ్వరంలోని మూడు డ్యాంలు ఉంటాయనే నమ్మకం లేదని రిపోర్ట్ వచ్చింది.. గ్రాడ్యుయేట్ ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ ఇష్టమొచ్చిన్నట్లు మాట్లాడుతున్నాడు.. ధనికులే కాదు పేదలు కూడా క్వాలిటీ అన్నం తినాలి.. నేను శ్రీధర్ బాబు అమెరికా పర్యటనకు వెళ్తున్నాం.. అమెరికాలోని కంపెనీల ప్రతినిధులతో భేటీ అవుతామన్నారు. అలాగే, టెట్ ఫీజు గురించి కేటీఆర్ బాధ పడుతున్నాడు.. కొందరు యువత ఉద్యోగాలు లేక అప్పులు తెచ్చుకుని వైన్స్ టెండర్లు వేశారు.. వైన్స్ టెండర్ కు రెండు లక్షల నాన్ రిఫండబుల్ డిపాజిట్ ను పెట్టి.. రక్తం పీల్చుకున్నారు.. పదేండ్లు అధికారంలో ఉన్న పార్టీ మూడు నెలల్లోనే ఇలా దిగజారిపోతుందా.. మీరు చేసిన అవినీతి, అక్రమాల వల్లే పార్టీ కూలిపోతుంది.. ఫలితాల తరువాత బీఆర్ఎస్ లో ఒక్కరు ఉండరు.. డిపాజిట్ రాని పార్టీలో
ఎమ్మెల్యేలు ఎలా ఉంటారు అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు.