Calcutta High Court: ఒక సంచలనమైన తీర్పును కలకత్తా హైకోర్టు ఇచ్చిందని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ అన్నారు. ముస్లింలని ఓబీసీలలో చేర్చడాన్ని అక్కడి న్యాయస్థానం తప్పు పట్టిందన్నారు. 75 ముస్లిం కులాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఓబీసీలలో చేర్చింది.. రాజకీయ ప్రయోజనాల కోసం ముస్లిం సమాజాన్ని ఒక వస్తువుగా పరిగణిస్తున్నారు.. బుజ్జగింపు రాజకీయాలకి, ముస్లిం సంతుస్టీకరణకు చెంప పెట్టు లాంటి తీర్పు ఇచ్చింది అని ఆయన చెప్పుకొచ్చారు. ఓటు బ్యాంక్ రాజకీయాలకి ఇకనైనా స్వస్తి పలకాలి.. బెంగాల్ లో జరిగినట్టే తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లోని బీసీ- ఈలో ముస్లింలను చేర్చారు.. ఆ తీర్పు ఇక్కడ కూడా వర్తిస్తుంది అని లక్ష్మణ్ పేర్కొన్నారు.
Read Also: Nikki Haley : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ కు నిక్కీ హేలీ మద్దతు
బీసీల హక్కులను కాలరాస్తున్నారు అని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. బీసీ సంఘాలు స్పందించాలి.. కోర్ట్ తీర్పును పరిగణనలోకి తీసుకోమని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పుకొచ్చారు.. చట్టాలకు కూడా అతీతం అనే విధంగా వ్యవహరిస్తున్నారు రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారు.. దేశ వ్యాప్తంగా కలకత్తా హైకోర్టు తీర్పును బీజేపీ స్వాగతిస్తుంది.. వ్యతిరేకించే వారి దిష్టి బొమ్మను దగ్ధం చేయాలని పిలుపునిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
Read Also: Pushpa 2 : పుష్ప 2 నుంచి సెకండ్ సాంగ్ ప్రోమో వచ్చేసింది…
మరో వైపు, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వానికి కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. OBCలలో పలు క్లాసులు కొట్టి వేసినది.. 2010 తర్వాత నుంచి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన అన్ని ఓబీసీ ధృవపత్రాలను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. బీజేపీ ఓబీసీ మోర్చా తెలంగాణ ఆధ్వర్యంలో తీర్పును ఆహ్వానిస్తూ ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు మహాత్మా జ్యోతిబా ఫూలే విగ్రహం అలీ కేఫ్ చౌరస్తా అంబర్ పేట్ దగ్గర కార్యక్రమం నిర్వహించడంతో పాటు కలకత్తా హైకోర్టు తీర్పుని వ్యతిరేకిస్తున్న మమత బెనర్జీ తీరుకు నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది అని ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గంధమల్ల ఆనంద్ గౌడ్ వెల్లడించారు.