భారత దేశంలో ఈరోజు చివర దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఇదిలావుండగా, 57 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఇక, ఓటర్లను ఉద్దేశించి రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
ఎగ్జిట్ పోల్స్ చర్చలకు దూరంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయంపై కేంద్ర మంత్రి అమిత్ షా రియాక్ట్ అయ్యారు. కాంగ్రెస్ ఇప్పటికే ఓటమిని అంగీకరించిందని పేర్కొన్నారు.
పూణె పోలీస్ పోర్షే కారు ప్రమాదంలో కొత్త ట్విస్ట్ బయటపడింది. పోర్షే కారు ప్రమాదం కేసులో యువకుడి రక్త నమూనాలను అతని తల్లితో మార్చుకున్నట్లు నిర్ధారించిన తర్వాత పూణె పోలీసులు యువకుడి తల్లిని సైతం అరెస్టు చేశారు.
నేటి నుంచి టీ20 వరల్డ్ కప్ 2024 స్టార్ట్ కానుంది. ఆతిథ్య దేశం అమెరికా, కెనడా జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగబోతుంది. అయితే, ఈసారి టీ20 వరల్డ్ కప్‌కు అమెరికా, వెస్టిండీస్ కలిసి ఆతిథ్యం ఇస్తున్నాయి. మొత్తం 20 జట్లు ఈ టైటిల్ కోసం పోటిపడుతున్నాయి.
టీమిండియా చాంపియన్స్ తమ టీంను ప్రకటించింది. సిక్సర్ల కింగ్, 2007(T20), 2011(ODI) వరల్డ్‌కప్స్ విజేత యువరాజ్ సింగ్ ఈ జట్టుకు సారథిగా ఎంపికయ్యాడు. సురేశ్ రైనా, పఠాన్ బ్రదర్స్, ఆర్పీ సింగ్ తదితరులు ఈ టీమ్ లో స్థానం దక్కించుకున్నారు. కాగా భారత్ తో పాటు వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ లీగ్‌లో ఆస్ట్రేలియా చాంపియన్స్, ఇంగ్లండ్ చాంపియన్స్, సౌతాఫ్రికా చాంపియన్స్, పాకిస్తాన్ చాంపియన్స్, వెస్టిండీస్ చాంపియన్స్ ఆడబోతున్నాయి.
పొరుగుదేశంపై మరోసారి ప్రతీకార చర్యలకు కిమ్ జోంగ్ దిగారు. కానీ, ఈసారి క్షిపణులు, బాంబులతో మాత్రం కాదు. బెలూన్లతో తమ దేశంలోని చెత్తను దక్షిణ కొరియాలో జారవిడిచి ప్రతీకారం తీర్చుకున్నారు.
నేటి నుంచి ట్రాఫిక్ రూల్స్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి. కొత్త డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనలు కూడా అమల్లోకి రానున్నాయి. ఎవరైనా ఈ నిబంధనలను అతిక్రమిస్తే భారీ జరిమానా విధించేలా నిబంధనలు మార్పులు చేశారు.
జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధిక పోలింగ్ శాతం నమోదైంది.. దర్శి నియోజకవర్గంలో ఏపీలో అత్యధికంగా 90.25 శాతం పోలింగ్ పర్సంటేజ్ వచ్చింది అని ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. ఒంగోలు పార్లమెంట్ కౌంటింగ్ రైజ్ ఇంజినీరింగ్ కళాశాలలో జరుగుతుంది.. అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలకు ఒక్కొక్క అసెంబ్లీకి 14 టేబుల్స్ చొప్పున 28 టేబుళ్ళు ఏర్పాటు చేస్తున్నాం.. ఒంగోలు పార్లమెంట్ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుకు ప్రత్యేకంగా 40 టేబుల్స్ ఏర్పాటు చేశాం.. కౌంటింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ పద్ధతిలో […]