ఆంధ్రప్రదేశ్ లో గత టీడీపీ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ ఛీఫ్ గా పని చేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్లు ఏపీ హైకోర్టు తెలిపింది. అయితే, ఏబీని రెండోసారి సస్పెండ్ చేయడం చెల్లదంటూ కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ క్యాట్ ఉత్తర్వుల్ని ఉన్నత న్యాయస్థానం సమర్దించింది.
విజయవాడలో కలుషిత నీటి వల్ల డయేరియా కేసులు విజృంభిస్తున్నాయి. ఇప్పటికే ఏడుగురిని మరణించగా.. అధికారులు, పాలకుల అలసత్వంతో కలుషిత నీటి తాగుతూ అనేక మంది హస్పటల్ పాలవుతున్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ మళ్లీ పెరగింది. శ్రీవారి సర్వదర్శనానికి ఎస్ఎస్డీ టోకెన్లు లేకుండా వెళ్లిన వారికి దర్శనం చేసుకునేందుకు టైం పడుతుందని టీటీడీ తెలిపింది. ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు వెల్లడించింది.
పల్నాడు జిల్లాను ఉద్దేశించి జిల్లా ఎస్పీ మల్లిక గార్గ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలోనే కాదు దేశంలోనే చెత్త జిల్లా పల్నాడు అంటూ పేర్కొనింది. పల్నాడు ప్రాంతానికి మంచి పేరు ఉంది, దానిని మీరు చెడగొట్టొద్దు అని చెప్పుకొచ్చింది.
కడప జిల్లాలో ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎటువంటి ఘర్షణలు జరగకుండా ఉండేందు కోసం అధికారులు తగిన చర్యలు చేపట్టారు. ఎన్నికల సందర్భంగా ఘర్షణలకు పాల్పడిన వారిపై ప్రత్యేక దృష్టి సారించి గృహ నిర్బంధంలో ఉండాలని నోటీసులు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నిన్న ( గురువారం) మరో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల సందర్భంగా తనపై నమోదైన కేసుల్లో విచారణ అధికారులను వెంటనే మార్చాలంటూ న్యాయస్థానంలో లంచ్ మోషన్ పిటిషన్ ను దాఖలు చేశారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు మరో షాక్ తగిలింది. పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్ తో సంబంధం బయటపడకుండా అనైతిక ఆర్థిక ఒప్పందం చేసుకున్నారన్న కేసులో.. ట్రంప్ దోషిగా తేలిపోయారు.