WCL 2024: ఈ సంవత్సరం మరో సరికొత్త టీ20 లీగ్ స్టార్ట్ కాబోతుంది. ఇంగ్లండ్ వేదికగా వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ పేరిట టోర్నమెంట్ ఆరంభంకానుంది. బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ సినీ, సంగీత సంస్థ ఇంగ్లండ్ క్రికెట్‌బోర్డు సహాయంతో ఈ ఈవెంట్ కు శ్రీకారం చుట్టింది. రిటైర్డ్ ప్లేయర్లు, నాన్- కాంట్రాక్ట్ ఆటగాళ్లు ఈ లీగ్‌లో ఆడనున్నారు. టీమిండియా చాంపియన్స్ సహా ఆరు టీమ్స్ ఇందులో పాల్గొనబోతున్నాయి. జూలై 3వ తేదీ నుంచి 13 వరకు యూకేలో ఈ టీ20 టోర్నీ నిర్వహించేందుకు షెడ్యూల్ రెడీ అయింది.
Read Also: BRS Candle Rally: నేడు బీఆర్‌ఎస్ క్యాండిల్ ర్యాలీ.. గన్ పార్క్ నుంచి సచివాలయం వరకు
కాగా, ఈ క్రమంలో టీమిండియా చాంపియన్స్ తమ టీంను ప్రకటించింది. సిక్సర్ల కింగ్, 2007(T20), 2011(ODI) వరల్డ్‌కప్స్ విజేత యువరాజ్ సింగ్ ఈ జట్టుకు సారథిగా ఎంపికయ్యాడు. సురేశ్ రైనా, పఠాన్ బ్రదర్స్, ఆర్పీ సింగ్ తదితరులు ఈ టీమ్ లో స్థానం దక్కించుకున్నారు. కాగా భారత్ తో పాటు వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ లీగ్‌లో ఆస్ట్రేలియా చాంపియన్స్, ఇంగ్లండ్ చాంపియన్స్, సౌతాఫ్రికా చాంపియన్స్, పాకిస్తాన్ చాంపియన్స్, వెస్టిండీస్ చాంపియన్స్ ఆడబోతున్నాయి. ఇక, జూలై 2వ తేదీన ఇంగ్లండ్, జూలై 5న వెస్టిండీస్, జూలై 6న పాకిస్తాన్, జూలై 8న ఆస్ట్రేలియా, జూలై 10న సౌతాఫ్రికా చాంపియన్స్‌తో టీమిండియా చాంపియన్స్ పోటీ పడనుంది. జూలై 12న సెమీస్, జూలై 13న ఫైనల్ మ్యాచ్ జరిపేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది.
Read Also: North Korea: మరోసారి ఉత్తర కొరియా కవ్వింపు చర్యలు.. బెలున్లతో చెత్త!
ఇక, టీమిండియా చాంపియన్స్ జట్టు ఇదే: యువరాజ్ సింగ్ (కెప్టెన్), సురేశ్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, గురుక్రీత్ మాన్, హర్భజన్ సింగ్, రాహుల్ శర్మ, నమన్ ఓజా, రాహుల్ శుక్లా, ఆర్పీ సింగ్, వినయ్ కుమార్, ధవల్ కులకర్ణి ఉన్నారు.