India vs Pakistan: భారత్- పాక్ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్.. ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs Pakistan: టీ20 ప్రపంచకప్ 2024లో హై వోల్టేజ్ క్రికెట్ సమరానికి రంగం సిద్ధమైంది. ఈ మెగా టోర్నమెంట్లో భాగంగా రేపు (జూన్ 9) న్యూయర్క్ వేదికగా టీమిండియా- పాకిస్తాన్ జట్లు మధ్య కీలక పోరు జరగబోతుంది. ఈ చిరకాల ప్రత్యర్థుల మ్యాచ్ ను వీక్షించేందుకు రెండు దేశాలకు చెందిన క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మ్యాచ్‌కు ముందు ఇరు జట్ల ఫ్యాన్స్ కు వాతావరణ శాఖ బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఈ మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగించే ఛాన్స్ ఉంది అని పేర్కొనింది. ఆదివారం నాడు మ్యాచ్ జరిగే టైంలో న్యూయర్క్‌లో వర్షం కురిసే అవకాశం ఉందని ‘అక్యూ వెదర్’ రిపోర్ట్ వెల్లడించింది.
Read Also: Rajamouli: రామోజీరావు పార్థివదేహం వద్ద రాజమౌళి కంటతడి.. భారత రత్న ఇవ్వాలంటూ!
Also Read
- Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
- Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
- Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
- Telangana 22A Land List: 22A నిషేధిత జాబితాపై NHRC సీరియస్.. తెలంగాణ సీఎస్‌కు కీలక ఆదేశాలు
కాగా, అమెరికా కాలమానం ప్రకారం ఉదయం 10. 30 గంటలకు (భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలు) ఈ మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. టాస్ వేసే సమయంలో 40 శాతం నుంచి 50 శాతం వరకు వర్షం పడే ఛాన్స్ ఉందని అక్యూ వెదర్ తమ రిపోర్ట్‌లో ప్రకటించింది. ఇక, వర్ష సూచన మధ్యాహ్నం 1 గంట సమయానికి 10 శాతానికి తగ్గిపోయి.. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు మళ్లీ 40 శాతానికి పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. ఒక వేళ వర్షం కారణంగా మ్యాచ్ క్యాన్సిల్ అయితే, ఇరు జట్లకు చెరో పాయింట్ లభిస్తోంది. ఈ మ్యాచ్ సమయంలో వాన పడితే ఎంతో కాలంగా వేచి ఉన్న క్రికెట్ అభిమానుల ఆశ మాత్రం అడియాశలు అయినట్లే అని క్రిడా పండితులు అంటున్నారు.
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!