NZ vs AFG: టీ20 వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ జట్టుకు ఆఫ్ఘనిస్తాన్ టీమ్ గట్టి షాక్ ఇచ్చింది. గ్రూప్- సీలో భాగంగా ఇవాళ జరిగిన మ్యాచ్ లో 84 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘాన్.. నిర్ణత 20 ఓవర్లలో 159 రన్స్ చేయగా, ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన కివీస్ టీమ్ 15.2 ఓవర్లలో మొత్తం జట్టు 75 పరుగులకే ఆలౌట్ అయింది. న్యూజిలాండ్ బ్యాటర్లు అట్టర్ ప్లాప్ కావడంతో కుప్పకూలిపోయింది. అంతకుముందు బ్యాంటింగ్ చేసిన ఆఫ్ఘాన్ జట్టులో గుర్భాజ్ 80, జద్రాన్ 44 పరుగులతో రాణించగా.. బౌలింగ్ లో రషీద్ ఖాన్, ఫజల్‌హాక్ ఫారూఖీ 4, మహ్మద్ నబీ 2 వికెట్లు తీసుకుని న్యూజిలాండ్ పతనాన్ని శాసించారు. అయితే, న్యూజిలాండ్ తరఫున ట్రెంట్ బౌల్ట్, మాట్ హెన్రీ తలో 2 వికెట్లు తీసుకున్నారు.
Read Also: Ramoji Rao: రామోజీరావు అస్తమయంపై చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి.. లోకేష్ సహా టీడీపీ నేతల సంతాపం..
కాగా, ఈ టోర్నీలో ఆఫ్ఘనిస్థాన్‌కు ఇది వరుసగా రెండో విజయం. ఈ విజయంతో ఆఫ్ఘాన్ సూపర్-8కి చేరుకునే అవకాశం ఉంది. ఇక, ఈ విజయంతో గ్రూప్-సీ పాయింట్ల పట్టికలో ఆఫ్ఘనిస్థాన్ మొదటి స్థానంలో నిలిచింది. రషీద్ సేన ఆ తర్వాతి రెండు మ్యాచ్‌లు పపువా న్యూ గినియా, వెస్టిండీస్‌తో ఆడనుంది. వీటిలో ఒక మ్యాచ్‌లో విజయం సాధించిన ఆఫ్ఘన్ జట్టు సూపర్-8కి చేరుకుటుంది. ఇక, ఈ మ్యాచ్ లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన రెహమానుల్లా గుర్బాజ్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. అయితే, ఈ మెగా టోర్నమెంట్ లో ఇప్పటికే పాకిస్థాన్ ను అమెరికా ఓడించి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.