కృష్ణా జిల్లాలోని గన్నవరం పరిధిలోని బాపులపాడు హైవేపై పైవేట్ ట్రావెల్స్ బస్సు నిలిచిపోవడంతో ప్రయాణీకులు నానా అగచాట్లు పడుతున్నారు. తెల్లవారుజాము నుంచి హైవే పైనే బస్సు నిలిచిపోయింది. అయితే, బస్సులో దాదాపు 36 మంది ప్రయాణికులు ఉన్నారు.
9th Class Girl Murder: కర్నూలు జిల్లాలోని ముచ్చుమర్రిలో అత్యాచారం, హత్యకు గురైన బాలిక మృతదేహం కోసం 4వ రోజు కూడా పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు. ఎన్డీఆర్ ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, స్థానిక మస్థ్యకారుల సహాయంతో కలిసి వెతుకుతున్నారు. జులై 7వ తేదీ నుంచి బాలిక కనిపించకుండా పోయింది.
Tirumala Darshanam: తిరుమలలో భక్తుల రద్దీ భారీగా కొనసాగుతుంది. వడ్డీకాసులవాడు వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్టుమెంట్లలని నిండిపోయ్యి వెలుపల క్యూ లైనులో వేచి ఉన్నారు. ఇక, టోకేన్ లేని భక్తులకు సర్వ దర్శనానికి దాదాపు 24 గంటల సమయం పడుతుంది.
Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్టైన సీఎం అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీం కోర్టు ఇవాళ (శుక్రవారం) తీర్పు ఇచ్చే అవకాశం ఉంది. లిక్కర్ స్కామ్ కేసులో తనను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేయడాన్ని కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో సవాలు చేస్తూ పిటిషన్ ఫైల్ చేశారు.
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. కౌన్సిల్ సమావేశానికి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు, ఎంపికి ఆహ్వానం పంపకపోవడంపై టీడీపీ సభ్యుల అభ్యంతరం వ్యక్తం చేశారు.
బెజవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని ఇంకా కొన్ని పనులు చేయాల్సి ఉంది.. అభివృద్ధిలో ఎక్కడ రాజీ పడే పనే లేదు అని దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సూచనతో పాలక మండలి కూడా ఏర్పాటు చేస్తామన్నారు.
ఐదేళ్ల వైసీపీ విధ్వంసకర పాలనలో అన్ని రంగాలు వెనక్కి వెళ్లాయని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు తెలిపారు. టీడీపీ ప్రభుత్వం గుర్తించిన గ్రోత్ ఇంజిన్లను గత ప్రభుత్వం విస్మరించింది.. పోలవరం, నదుల అనుసంధానం, ప్రజా రాజధాని అమరావతి నిర్మాణం, విద్యుత్, పారిశ్రామిక రంగాలు తదితరాలను వైసీపీ పట్టించుకోలేదని విమర్శించారు.
Chandrababu: ఆర్థిక శాఖపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో తాజాగా ఉన్న ఆర్థిక పరిస్థితిపై చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రానికి ఉన్న అప్పులు లెక్కలపై చంద్రబాబు ఆరా తీశారు.