YS Jagan Protest: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బృందం ఇప్పటికే ఢిల్లీకి చేరుకుంది. ఏపీలో జరుగుతున్న హింసాకాండకు నిరసనగా వైఎస్ జగన్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నేడు ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయనున్నారు.
Tirumala Tickets: నేడు (జులై 24) ఉదయం 10 గంటలకు అక్టోబర్ నెలకు సంబంధించిన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విడుదల చేయనుంది. తిరుమల, తిరుపతిలలో అక్టోబరు నెల గదుల కోటాను నేటి మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో రిలీజ్ చేయనుంది.
AP Assembly: గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై శ్వేతపత్రాలు విడుదల చేస్తూ వస్తున్న ఎన్డీయే కూటమి సర్కార్ ఎక్సైజ్ శాఖలో జరిగిన అక్రమాల చిట్టాను విప్పేందుకు సిద్ధమైంది. సీఎం చంద్రబాబు మద్యం అక్రమాలపై శ్వేతపత్రాన్ని అసెంబ్లీలో విడుదల చేయనున్నారు.
అతి భారీ వర్షాలు ఏజెన్సీ వ్యాప్తంగా కురుస్తున్నాయి. ఏజెన్సీలో వాగులు, గెడ్డల ఉధృతి కొనసాగుతుంది. గత వారం రోజులుగా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో వందలాది గిరిజన గ్రామాల ప్రజలు ఇళ్లకే పరిమితం అవుతున్నారు.
Swaminarayan Temple: మరోసారి కెనడాలోని హిందూ ఆలయాలపై దాడులు కొనసాగుతున్నాయి. ఎడ్మింటన్లోని బీఏపీఎస్ స్వామి నారాయణ్ దేవాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు గ్రాఫిటీ పెయింట్ వేశారు.
P. Chidambaram: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై కాంగ్రెస్ సీనియర్ నేత, ఆర్థిక మాజీ మంత్రి పి. చిదంబరం తన ఎక్స్ వేదికగా వ్యాఖ్యనించారు.
బంగ్లాదేశ్ ప్రజలకు బెంగాల్ రాష్ట్రానికి వచ్చేందుకు ద్వారాలు తెరిచే ఉంటాయి: సీఎం మమతా, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యలను ఖండించిన గవర్నర్ సీవీ ఆనంద బోస్.., దీదీ వ్యాఖ్యలపై నివేదిక సమర్పించాలని ఆదేశాలు: గవర్నర్ సీవీ ఆనంద బోస్..
Income Tax Slabs 2024: 2024-25 కేంద్ర బడ్జెట్లో వ్యక్తిగత ఆదాయ పన్ను విషయంలో వేతన జీవులకు కొద్దీగా రిలీఫ్ దొరికింది. కేంద్ర సర్కార్ ఆదాయ పన్ను శ్లాబుల్లో స్వల్ప మార్పులు చేసింది.