Tirumala Tickets: నేడు (జులై 24) ఉదయం 10 గంటలకు అక్టోబర్ నెలకు సంబంధించిన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విడుదల చేయనుంది. తిరుమల, తిరుపతిలలో అక్టోబరు నెల గదుల కోటాను నేటి మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో రిలీజ్ చేయనుంది. జులై 27వ తేదీన తిరుమల – తిరుపతి శ్రీవారి సేవ కోటా ఉదయం 11 గంటలకు, నవనీత సేవ మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ మధ్యాహ్నం 1 గంటకు ఆన్‌లైన్‌లో టీటీడీ అధికారులు విడుదల చేయనున్నారు. తిరుమల శ్రీవారి భక్తులు https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీవారి ఆర్జిత సేవ, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని కోరింది. ఇదిలా ఉండగా.. అక్టోబర్ 4 నుంచి 12 వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. అందుకే అక్టోబర్ 4 నుంచి 10వ తేదీ వరకు సుప్రభాత సేవ మినహా, మిగిలిన అన్ని ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది.
Read Also: Jammu Kashmir: టెర్రిరిస్ట్ లతో సంబంధాలు.. నలుగురు ఉద్యోగులను తొలగించిన జమ్మూకశ్మీర్ ప్రభుత్వం
కాగా, ఇవాళ తిరుమలలో పల్లవోత్సవం జరగనుంది. మైసూరు మహారాజు జయంతి సందర్భంగా కర్ణాటక చౌల్ట్రీ దగ్గర ప్రత్యేక పూజలను టీటీడీ నిర్వహించనుంది. అలాగే, తిరుమలలో శ్రీవారి దర్శనానికి 10 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులుకు సర్వ దర్శనానికి 8 గంటల సమయం పడుతుంది. ఇక, నిన్న శ్రీవారిని 73, 332 మంది భక్తులు దర్శించుకోగా.. 25, 202 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.73 కోట్ల రూపాయలు వచ్చింది.