Vizag MLC Election: విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్లకు గడువు ముగిసింది. ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు కేవలం రెండు నామినేషన్లు మాత్రమే దాఖలు అయ్యాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున అభ్యర్థిగా ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, స్వతంత్య్ర అభ్యర్థిగా షఫీ ఉల్లా నామినేషన్లు దాఖలు చేశారు.
AP High Court: ప్రైవేట్ వైద్య కళాశాలల్లో ఈడబ్ల్యూఎస్ కోటా సీట్ల కేటాయింపు జీవోను నిలిపివేస్తున్నట్లు ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జీవోను సవాలు చేస్తూ విద్యార్థులు వేసిన పిటిషన్పై ఇవాళ (మంగళవారం) హైకోర్టులో విచారణ కొనసాగింది.
Nadendla Manohar: త్వరలోనే 41 A కింద నోటీసులు ఇచ్చి రేషన్ బియ్యం అక్రమ తరలింపు చేసిన వారి అరెస్టులు కూడా ఉంటాయని మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు. ఇప్పటికే 6A కింద నోటీసులు ఇచ్చి క్రిమినల్ కేసులు నమోదు చేశామన్నారు.
Divvala Madhuri: శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలిలో దువ్వాడ కుటుంబ వ్యవహారంపై దివ్వల మాధురి మరోసారి స్పందించింది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మా బంధాన్ని రాజకీయ కోణంలో చూడకండి.. వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూడకూడదు అని చెప్పుకొచ్చింది.
Vizag MLC Election: విశాఖపట్నంలో ఎమ్మెల్సీ ఎన్నికల పోటీపై కూటమి నేతల కీలక సమావేశం అయింది. ఎమ్మెల్యేల అభిప్రాయాలు సేకరించనున్న అధిష్ఠానం నియమించిన కమిటీ.. ఆరుగురు సభ్యులతో ఏర్పాటు చేసిన నివేదిక ఆధారంగా పోటీపై ఎన్డీయే కూటమి నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది.
Anam Ramanarayana Reddy: ఏపీ సచివాలయంలో ఆనం రామనారాయణ రెడ్డి దేవాదాయ శాఖ మంత్రిగా పదవి బాధ్యతలను స్వీకరించారు. బ్లాక్-2లోని తన ఛాంబర్లో పూజలు చేసిన వేదపండితులు ఆయనకు ఆశీర్వచనాలిచ్చారు.
CM Chandrababu: తుంగభద్ర డ్యాం కొట్టుకుపోవడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. కర్ణాటక ఇరిగేషన్ అధికారులతో సమన్వయం చేలుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
Duvvada Srinivas: శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలిలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందు మూడో రోజు హైడ్రామా కొనసాగుతుంది. దువ్వాడ ఇంటి ముందు రాత్రిపూట కార్ షెడ్ లోనే భార్య వాణి, కుమార్తె హైందవి పడుకున్నారు.