CM Chandrababu: తుంగభద్ర డ్యాం కొట్టుకుపోవడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. కర్ణాటక ఇరిగేషన్ అధికారులతో సమన్వయం చేలుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. తుంగభద్ర డ్యాం అధికారులకు ఏపీ వైపు నుంచి కావాల్సిన సహకారం అందివ్వాలని రాష్ట్ర ఇరిగేషన్ అధికారులకు సీఎం సూచనలు చేశారు. అనంతపురం, కర్నూలు జిల్లాలకు చెందిన రైతులకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పంట నష్టం పోకుండా చూడాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
Read Also: US Green Card : అమెరికా గ్రీన్ కార్డుల్లో ఆ దేశం ఫస్ట్ ప్లేస్.. మన దేశం ఎక్కడుందంటే ?
ఇక, తుంగభద్ర డ్యాం గేటు కొట్టుకుపోయిన సంఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేశారు అని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. తుంగభద్ర డ్యాం సంఘటన ప్రదేశానికి చంద్రబాబు ఆదేశాలతో సెంట్రల్ డిజైన్ కమిషనరుతో పాటు ఇంజనీరింగ్ డిజైన్స్ బృందం వెళ్ళింది.. డ్యాం గేటు కొట్టుకు పోయినందున ప్రజలను అప్రమత్తం చేసేలా జిల్లా కలెక్టరుకు ఆదేశాలు ఇచ్చామన్నారు. కౌతాలం, కోసిగి, మంత్రాలయం, నందవరం మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని తెలిపింది. శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టుల అధికారులను అప్రమత్తంగా ఉండాలని మంత్రి నిమ్మల రామానాయుడు హెచ్చరించారు.