Congress: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హత్యకు కుట్ర జరుగుతోందని కాంగ్రెస్ ఆరోపణలు చేసింది. ఈ మేరకు పలువురు బీజేపీ నేతలపై ఈరోజు ఢిల్లీలోని తుగ్లక్ రోడ్ పోలీస్స్టేషన్లో కంప్లైంట్ చేశారు. అలాగే, ఫిర్యాదు ప్రతిని కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అజయ్ మాకెన్ పంపారు.
MP Sanjay Singh: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తన అధికారిక నివాసాన్ని వారం రోజుల్లో ఖాళీ చేస్తారని.. ప్రభుత్వ సౌకర్యాలన్నింటినీ వదులుకుంటారని ఆ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ ఈరోజు (బుధవారం) తెలిపారు.
Building Collapses in Delhi: దేశ రాజధాని ఢిల్లీలో ఓ భవనం కుప్పకూలిపోయింది. కరోల్బాగ్లోని ప్రసాద్ నగర్ ఏరియాలో రెండంతస్తుల నివాస భవనంలోని ఓ భాగం ఈరోజు (బుధవారం) కూలింది. దీంతో అనేక మంది శిథిలాల కింద చిక్కుకుని పోయారు.
New Chinese Heliport: అరుణాచల్ ప్రదేశ్లోని సున్నితమైన 'ఫిష్టెయిల్స్' ప్రాంతానికి సమీపంలో వాస్తవ నియంత్రణ రేఖకు తూర్పున 20 కిలోమీటర్ల దూరంలో కొత్త హెలిపోర్ట్ ను డ్రాగన్ కంట్రీ నిర్మిస్తుంది. మారుమూల ప్రాంతంలోకి సైనికు వేగంగా తరలించే సామర్థ్యాన్ని చైనా సాయుధ దళాలు రెడీ చేసుకుంటున్నాయి.
Kolkata Doctor Rape Case: కోల్కతాలో ట్రైనీ డాక్టర్ పై హత్యాచార ఘటన తీవ్ర ప్రకంపనలు రేపుతుంది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో చర్చలు జరిపిన వైద్యులు తమ నిరసనలు ఇంకా కొనసాగిస్తున్నారు. మరికొన్ని డిమాండ్లను వినిపించేందుకు మరోసారి ముఖ్యమంత్రితో సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
MK Stalin: ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) సేవలు మరో శతాబ్దానికి అవసరం.. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి అపూర్వ విజయాన్ని అందించాలని తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ పార్టీ కార్యకర్తలను కోరారు.
Karnataka Governor: కర్ణాటక ప్రభుత్వం- రాజ్భవన్ల మధ్య తీవ్ర స్థాయిలో వివాదం కొనసాగుతుంది. మే 2023 నుంచి లోకాయుక్తలో ప్రభుత్వ అధికారులపై ప్రాసిక్యూషన్ కేసులపై గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ సమాచారం కోరారు.
Tirumala Tickets: తిరుమల శ్రీవారి అర్జిత సేవా టిక్కెట్లను టీటీడీ అధికారులు కాసేపట్లో (బుధవారం) విడుదల చేయనున్నారు. ఈ-సేవా టిక్కెట్ల ఎలక్ట్రానికి లక్కీడిప్ కోసం ఈ నెల 20వ తేదీన ఉదయం 10 గంటలకు నమోదు చేసుకునే అవకాశం.