Kolkata Doctor Rape Case: కోల్కతాలో జూనియర్ డాక్టర్ హత్యాచారం కేసులో మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్, పోలీస్ అధికారి అభిజిత్ మోండల్లకు మరో మూడు రోజుల పాటు సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ సిటీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Donald Trump: అమెరికా పర్యటనకు వెళ్లనున్న భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో వచ్చే వారం సమావేశం అవుతానని మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత రిపబ్లిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.
J&K Assembly Poll: జమ్ముకశ్మీర్లో 10 సంవత్సరాల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. కేంద్రపాలిత ప్రాంతంలో నేడు తొలి విడత ఎన్నికల పోలింగ్ స్టార్ట్ అయింది. మొదటి దశలో 24 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. పౌరులు "పెద్ద సంఖ్యలో ఓటు వేసి ప్రజాస్వామ్య పండుగ"ను జరుపుకోవాలని ప్రధాని మోడీ అన్నారు.
యాగీ తుఫాన్ వల్ల కురుస్తున్న భారీ వర్షాలతో అతలాకుతలం అవుతోంది. భారీ వరదలు వస్తుండటంతో పెద్ద ఎత్తున కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో దాదాపు 226 మంది మరణించగా.. మరో 77 మంది తప్పిపోయినట్లు అధికారులు తెలిపారు.
Lebanon Pagers Explosion: లెబనాన్, సిరియాలపై మంగళవారం అనూహ్య మెరుపు దాడి జరిగింది. రెండు దేశాల్లో ఒకేసారి వందల పేజర్లు పేలుళ్లు జరిగాయి. ఫలితంగా 9 మంది మరణించారు. 2,750 మందికి పైగా గాయపడ్డారు.
Devineni Avinash: వరద ప్రభావిత ప్రాంతలలో నిత్యవసర సరుకుల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. రాణిగారితోట 17, 18వ డివిజన్ లలో జరిగిన కార్యక్రమంలో వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జ్ దేవినేని అవినాశ్, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ.. నగరంలోని వరద బాధితులను ఆదుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. పెద్ద మనసుతో ఒక కోటీ పది లక్షల సహాయం మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు అని ఆయన తెలిపారు.