Tirumala Tickets: భక్తులకు అలర్ట్.. కాసేపట్లో డిసెంబర్ నెల శ్రీవారి దర్శన టికెట్లు..
- నేడు డిసెంబర్ నెల శ్రీవారి దర్శన టికెట్లు..
- లక్కీడిప్ టిక్కెట్లు పొందిన భక్తులు 22 మధ్యాహ్నం 12 గంటలలోపు రుసుం చెల్లించాలి..
- సెప్టెంబర్ 24న గదుల కేటాయింపు కోటాను విడుదల చేయనున్న టీటీడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala Tickets: తిరుమల శ్రీవారి అర్జిత సేవా టిక్కెట్లను టీటీడీ అధికారులు కాసేపట్లో (బుధవారం) విడుదల చేయనున్నారు. ఈ-సేవా టిక్కెట్ల ఎలక్ట్రానికి లక్కీడిప్ కోసం ఈ నెల 20వ తేదీన ఉదయం 10 గంటలకు నమోదు చేసుకునే అవకాశం. లక్కీడిప్ టిక్కెట్లు పొందిన భక్తులు 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు రుసుం చెల్లించాల్సి ఉండబోతుంది. ఇక, లక్కీడిప్‌లో పొందిన టికెట్లు మంజూరు చేస్తారు టీటీడీ అధికారులు. డిసెంబర్ నెలకు సంబంధించిన వివిధ సేవలకు, దర్శనానికి ముందస్తుగా బుక్ చేసుకోవాలనుకునే భక్తులు https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సూచిస్తున్నారు.
Also Read
- Tirumala Garuda Seva: రేపే గరుడ సేవ.. తిరుమలకు వెళ్లే భక్తులకు అలర్ట్.. ఘాట్ రోడ్డులో ఆంక్షలు
- Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
- Chandrababu Tirumala Visit: తిరుమలకు సీఎం చంద్రబాబు.. శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణలో రికార్డు
- Tirumala Srivari Brahmotsavam 2026: నేటి నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. తిరుమలలో భారీ ఏర్పాట్లు
కాగా, డిసెంబరు నెలకు సంబంధించిన శ్రీవారి కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను సెప్టెంబరు 21 ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో టీటీడీ విడుదల చేయనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవల కోటా రిలీజ్ తో పాటు.. వర్చువల్ సేవల దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను ఆన్ లైన్ లో విడుదల చేయబోతుంది. ఇక, సెప్టెంబరు 23వ తేదీన ఉదయం 10 గంటలకు డిసెంబరు నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను అదే రోజు ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు టికెట్లను, మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ కాలిక వ్యాధులున్నవారు శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచితంగా స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కోటాను టీటీడీ ఆన్‌లైన్‌లో రిలీజ్ చేయబోతుంది.
Read Also: Jr. NTR : యంగ్ టైగర్ – వెట్రి మారన్ – Sun పిక్చర్స్.. ఫిక్స్..?
ఇక, డిసెంబరు నెలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను సెప్టెంబరు 24వ తేదీన ఉదయం 10 గంటలకు, తిరుమల, తిరుపతిలలో గదుల కేటాయింపు కోటాను మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో తిరుమల తిరుపతి దేవాస్థానం విడుదల చేయనుంది. సెప్టెంబరు 27వ తేదీన శ్రీవారి సేవకు సంబంధించిన కోటా ఉదయం 11 గంటలకు, నవనీత సేవ మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ మధ్యాహ్నం 1 గంటకు ఆన్‌లైన్‌లో రిలీజ్ చేయబోతుంది టీటీడీ.
తాజావార్తలు
-
Bhatti Vikramarka : కరెంట్ డిమాండ్‌లో బిగ్ రికార్డ్.. 20 వేల మెగావాట్లకు చేరిక.!
-
Jammu Kashmir: అఫ్జల్ గురు కుటుంబానికి షాక్.. బుల్డోజర్ యాక్షన్.!
-
RBI: ఆర్బీఐ షాక్ ఇవ్వబోతుందా? రేపు వడ్డీ రేట్లు పెరగబోతున్నాయా? నిపుణుల అంచనా ఇదే!
-
Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
-
Asaduddin Owaisi : ఓట్ల తొలగింపుపై ఒవైసీ ఫైర్.. సెక్రటేరియట్లో కీలక డిమాండ్లు
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!