Mumbai: ముంబైలో దారుణం చోటు చేసుకుంది. మాల్వాని ప్రాంతంలో నివాసం ఉంటున్న ఓ మహిళ ముఖంపై భర్త యాసిడ్ పోసి దాడి చేశాడు. ఈ ఘటనలో బాధితురాలిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Jharkhand Liquor Scam: జార్ఖండ్‌లో మద్యం కుంభకోణం మొత్తం కుట్ర రాయ్‌పూర్‌లో జరిగినట్లు తేలింది. రాయ్‌పూర్‌లోని ఎకనామిక్ అఫెన్సెస్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (EOW) తన ఎఫ్ఐఆర్లో ఈ స్కామ్ గురించి ప్రస్తావించింది.
UNSC: ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత దేశం చేస్తున్న ప్రయత్నాలకు ఫ్రాన్స్ సపోర్ట్ ఇచ్చింది. శక్తిమంతమైన భద్రతా మండలిని వెంటనే విస్తరించాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొనింది.
ఈ రోజు (శుక్రవారం) తెల్లవారుజామున చెన్నై పోర్టులో కస్టమ్స్ అధికారులు భారీ మొత్తంలో డ్రగ్స్‌ను సీజ్ చేశారు. ఓ ముఠా కంటైనర్‌లో అక్రమంగా విదేశాలకు తరలిస్తున్న దాదాపు 110 కోట్ల రూపాయల విలువైన నిషేధిత డ్రగ్స్‌ను కస్టమ్స్ అధికారులు గుర్తించారు.
Mahalakshmi Murder: బెంగళూరు మహాలక్ష్మి కేసులో ప్రధాన నిందితుడు ముక్తి రంజన్ ప్రతాప్ రేయ్ ఆత్మహత్య తర్వాత మరిన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రంజన్ ఆత్మహత్యకు ముందు నిందితుడు తన తల్లికి ఈ సంఘటన గురించి మొత్తం చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది.
Israel-Hezbollah: ఇజ్రాయెల్- హెజ్బొల్లా ఘర్షణను ఆపేందుకు అమెరికా, ఫ్రాన్స్ తో పాటు ఇతర దేశాలు చేసిన 21 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదనను నిన్న (గురువారం) ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు తోసిపుచ్చారు.
P. Chidambaram: కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం సంచలన వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్లను పూర్తిగా రద్దు చేసేందుకు కాషాయ పార్టీ ఏమాత్రం వెనకాడదన్నారు.
సిద్ధరామయ్య రాజీనామా చేయాలని బీజేపీ- జేడీఎస్ డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై స్పందించాలని ముఖ్యమంత్రిని మీడియా ప్రతినిధులు ప్రశ్నించాగా.. సహనం కోల్పోయిన ఆయన, మైక్‌లను పక్కకు తోసేసి.. అవసరమైతే నేనే పిలిచి మాట్లాడుతాగా అంటూ సీరియస్ అయ్యారు.
Sanjay Rout: పరువు నష్టం కేసులో శివసేన (యూబీటీ) కీలక నేత సంజయ్ రౌత్‌కు భారీ షాక్ తగిలింది. భారతీయ జనతా పార్టీ నేత కిరీట్ సోమయ్య భార్య మేధ సోమయ్య దాఖలు చేసిన పరువు నష్టం కేసులో ఆయనకు 15 రోజుల పాటు జైలు శిక్ష విధిస్తూ ముంబయి న్యాయస్థానం తీర్పు వెల్లడించింది.