Israel-Hezbollah: కాల్పుల విరమణను తిరస్కరించిన నెతన్యాహు.. దాడులు ఆపేదిలేదు..
- ఇజ్రాయెల్- హెజ్‌బొల్లా ఘర్షణను ఆపేందుకు అమెరికా- ఫ్రాన్స్ ప్రయత్నం..
- 21 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదనను తిరస్కరించిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు..
- తమ లక్ష్యాలను సాధించే వరకు హెజ్‌బొల్లాపై దాడులు ఆపే ప్రసక్తే లేదు: బెంజమిన్ నెతన్యాహు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel-Hezbollah: ఇజ్రాయెల్- హెజ్‌బొల్లా ఘర్షణను ఆపేందుకు అమెరికా, ఫ్రాన్స్ తో పాటు ఇతర దేశాలు చేసిన 21 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదనను నిన్న (గురువారం) ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు తోసిపుచ్చారు. తమ లక్ష్యాలను సాధించేవరకు హెజ్‌బొల్లాపై దాడులు ఆపే ప్రసక్తే లేదని తెలిపారు. లెబనాన్‌పై పూర్తిశక్తితో విరుచుకుపడాలని సైన్యానికి ఈ సందర్భంగా ఆదేశాలు జారీ చేశారు. మేం మా లక్ష్యాలను సాధించేవరకు ఈ దాడులు ఆపబోమన్నారు. కాగా, హెజ్‌బొల్లా దాడుల కారణంగా ఉత్తర ఇజ్రాయెల్‌ను ఖాళీ చేసిన పౌరులు తమ నివాసాలకు తిరిగి వెళ్లడం మాకు కీలకం అని బెంజమెన్ నెతన్యాహు అన్నారు.
Read Also: Sri Mahalakshmi Stotram: శుక్రవారం నాడు ఈ స్తోత్రాలు వింటే మీ ఇంట్లో ధన వర్షమే..!
Also Read
కాగా, గురువారం మరో కీలక పరిణామం జరిగింది. ఇజ్రాయెల్ దాడిలో హెజ్‌బొల్లాకు చెందిన డ్రోన్ యూనిట్ కమాండర్ మరణించారు. లెబనాన్ రాజధాని బీరుట్‌లోని దాహియాలో ఈ కమాండర్ ఉన్న అపార్టుమెంటుపై ఇజ్రాయెల్ మూడు క్షిపణులతో దాడి చేసింది. వారం రోజుల్లో దాహియాపై ఇది ఇజ్రాయెల్ చేసిన నాలుగో మెరుపు దాడి చేసింది. ఈ వరుస దాదాపు 17 మంది హెజ్‌బొల్లా సీనియర్ కమాండర్లను ఈ ప్రాంతంలోనే ఇజ్రాయెల్ చంపేసింది. బుధవారం రాత్రి లెబనాన్‌లోని బెకా లోయపై ఇజ్రాయెల్ సైన్యం.. ఐడీఎఫ్ చేసిన దాడుల్లో సుమారు 23 మంది సిరియన్లు మృత్యువాత పడ్డారు. మరోవైపు గాజాలోని జబాలియా శరణార్థి శిబిరం సమీపంలోని ఓ స్కూల్ పై ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడిలో 11 మంది ప్రాణాలు మరణించగా.. 22 మందికి గాయపడ్డారు.
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!