YS Jagan: రేపల్లె నియోజక వర్గంలో పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేపల్లె నియోజకవర్గంలో అనుకోని పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి.. కష్టాలు ఎప్పుడూ శాశ్వతంగా ఉండవు.. చీకటి తర్వాత వెలుగు తప్పకుండా వస్తుంది, ఇది సృష్టి సహజం.. విలువలు, విశ్వసనీయతే మనకు శ్రీరామ రక్ష.. వ్యక్తిత్వమే మనల్ని ముందుకు నడిస్తుంది అని ఆయన చెప్పుకొచ్చారు.
UK vs Russia: గత రెండేళ్లుగా రష్యా- ఉక్రెయిన్ల యుద్ధం జరుగుతుంది. ఈ క్రమంలో బ్రిటన్‌కు చెందిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ పలు సంచలన విషయాలు తెలిపింది. ఉక్రెయిన్‌కు సపోర్టుగా నిలిచిన బ్రిటన్‌లో అల్లకల్లోలం సృష్టించేందుకు రష్యా ప్రయత్నిస్తుందని ఎమ్ఐ5 ఏజెన్సీ ఆరోపించింది.
Hamas Chief: హమాస్ అధిపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇజ్రాయెల్‌పై ఆత్మాహుతి దాడులు చేసేందుకు యాహ్యా సిన్వార్ ఆదేశించినట్లు సమాచారం. ఈ విషయాన్ని వాల్‌స్ట్రీట్ పత్రిక ఓ కథనంలో వెల్లడించింది. సిన్వార్ అధికార కాంక్షతో ఉన్నాడని ఖతర్ అధికారులు చెప్పినట్లు పేర్కొనింది.
Haryana CM Meet PM Modi: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో మూడోసారి గెలిచి కాంగ్రెస్‌ను బీజేపీ మట్టికరిపించింది. ఈ సందర్భంగా ఈరోజు (బుధవారం) హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు.
UPI Transaction: ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశ నిర్ణయాలను ప్రకటించిన గవర్నర్ శక్తికాంత దాస్.. డిజిటల్ పేమెంట్స్‌కు సంబంధించి కీలక నిర్ణయాలను ప్రకటించారు. ఈ సందర్భంగా యూపీఐ లైట్ వ్యాలెట్ పరిమితి రూ.5 వేలకు పెంచినట్లు పేర్కొన్నారు.
israel: ఇజ్రాయెల్‌కు చెందిన రఫేల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్ సరికొత్త ఆయుధ సామర్థ్యాన్ని తొందరలోనే అమెరికాలో ప్రదర్శించనున్నట్లు తెలిపింది. ఈ సంస్థ లైట్ బీమ్ లేజర్ ఇంటర్సెప్షన్ సిస్టమ్‌ను అభివృద్ధి చేస్తుంది. దీనిని వాషింగ్టన్ డీసీలో ప్రదర్శనకు ఉంచనున్నట్లు ప్రకటించింది.
ఎన్సీ పార్టీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రాష్ట్ర హోదా ఇవ్వాలనే తీర్మానాన్ని ప్రధాని మోడీకి సమర్పిస్తామన్నారు. నియోజక వర్గాల పునర్విభజన, ఎన్నికలు, రాష్ట్ర హోదా లాంటి వాటి మీద తీర్మానం చేస్తామన్నారు. కొందరు నేతలు జమ్మూకశ్మీర్‌ను ఢిల్లీతో పోల్చడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
RBI Interest Rates: విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ భేటీ నిర్ణయాలను గవర్నర్ శక్తికాంత దాస్ ఈరోజు (బుధవారం) ప్రకటించారు.
Manipur Congress Chief: మణిపూర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కె మేఘచంద్ర సింగ్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) సమన్ల జారీ చేసింది. మణిపూర్ పీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి ఎన్ బుపెండా మెయిటే మాట్లాడుతూ.. ఈడీ ప్రతీకార రాజకీయాలకు దిగుతుందని విమర్శించారు.