Assembly Election Results: ఈరోజు జమ్మూకశ్మీర్, హర్యానా ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. నేటి ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభంకానుంది. ఉదయం 9 గంటలకు తొలి రౌండ్ ఫలితం రానుంది.
Israel Army Chief: అక్టోబర్ 7న హమాస్ దాడిని నిలువరించడంలో తాము విఫలమయ్యామని ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ అంగీకరించారు. దీనిపై నేడు ఆ దేశ ఆర్మీచీఫ్ హెర్జి హలెవీ ప్రత్యేక వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియోలో ఇది సుదీర్ఘ యుద్ధం.. ఇది సైనిక సామర్థ్యాలనే కాదు.. మానసిక శక్తిని.. దీర్ఘకాలం పోరాడే సామర్థ్యాన్ని పరీక్షిస్తుందన్నారు.
President Muizzu: మాల్దీవుల అధినేత మహ్మద్ ముయిజ్జు నాలుగు రోజుల పర్యటన కోసం భారత్కు వచ్చారు. ఈ సందర్భంగా ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ఇండియన్ టూరిస్టుల తమ దేశంలో పర్యటించాలని కోరారు. వారు తమ ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపిస్తారని తెలిపారు.
రతన్ టాటా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా రియాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా, నా ఆరోగ్యం గురించి ఇటీవల పుకార్లు వ్యాపించాయని నాకు తెలుసు.. ఈ వాదనలు నిరాధారమైనవని అందరికీ తెలియజేస్తున్నాను అని ఆయన చెప్పుకొచ్చారు.
Ratan Tata: ప్రముఖ సామాజిక కార్యకర్త, టాటా సన్స్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా (86) ఆరోగ్యం క్షీణించడంతో ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరారు. ఈరోజు (సోమవారం) ఉదయం ఆయనను ఆసుపత్రిలోని అత్యవసర గదికి తీసుకెళ్లగా పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
High Alert in Delhi: దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు హై అలర్ట్ జారీ చేశారు. దసరా, దీపావళి పండుగల సందర్భంగా ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందని సమాచారం ఢిల్లీ పోలీసులను నిఘా వర్గాలు అందించాయి.
PM Modi: నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గర్బా నృత్యంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేకమైన పాటను రాశారు. ఈ పాటను గాయని పూర్వా మంత్రి పాడారు. ఈ పాటకు సంబంధించిన వీడియోను నేడు ప్రధాని తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో షేర్ చేశారు.
Lalu Prasad Yadav: ల్యాండ్ ఫర్ జాబ్స్ కుంభకోణం కేసులో బీహార్ మాజీ సీఎం లాలు ప్రసాద్ యాదవ్, ఆయన తనయులు తేజస్వీయాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్కు ఢిల్లీ కోర్టులో బిగ్ రిలీఫ్ దొరికింది. కొద్దిసేపటి క్రితం బెయిలు మంజూరు చేస్తూ రౌస్ ఎవెన్యూ కోర్టు ఆదేశాలను జారీ చేసింది.
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీర్జాపూర్ జిల్లాలో ఆలయ నిబంధనలు విస్మరించిన ఒక అధికారిపై సస్పెండ్ అయ్యాడు. అయితే, వింధ్యవాసిని ఆలయంలోనికి పాదరక్షలు ధరించి వచ్చిన అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ (అగ్రికల్చర్)ను జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు సస్పెన్షన్ వేటు పడింది.
ED Raids On AAP MP House: పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజ్యసభ ఎంపీ సంజీవ్ ఆరోరా ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఈరోజు (సోమవారం) తనిఖీలు చేశారు. ఒక భూ వివాదానికి సంబంధించిన మనీలాండరింగ్ వ్యవహారంలో జలంధర్లోని ఎంపీకి చెందిన పలు చోట్ల సోదాలు కొనసాగిస్తుంది.