Bomb Threat: ఈరోజు ఉదయం ఢిల్లీ నుంచి లండన్‌కు బయలుదేరిన విస్తారా విమానానికి బాంబు బెదిరింపు రావడంతో అత్యవసరంగా విమానాన్ని ఫ్రాంక్‌ఫర్ట్‌కు మళ్లించినట్లు అధికారులు తెలిపారు. విమానం ఫ్రాంక్‌ఫర్ట్ ఎయిర్‌పోర్ట్‌లో తెల్లవారుజామున 12.40 గంటలకు (భారత కాలమానం ప్రకారం) సురక్షితంగా ల్యాండ్ అయింది. సుమారు రెండు గంటల పాటు క్షుణ్ణంగా చేసిన భద్రతా తనిఖీల్లో ఎలాంటి ప్రమాదం లేదని తేలింది. దీంతో ఆ తర్వాత ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి లండన్‌కు బయలుదేరిందని ఎయిర్‌లైన్ వెల్లడించింది.
Read Also: Boyapati : బాలకృష్ణ, చిరంజీవి కాంబోపై డైరెక్టర్ బోయపాటి సెన్సేషనల్ కామెంట్స్
అయితే, అక్టోబర్ 18న ఢిల్లీ నుంచి లండన్‌కు నడుపుతున్న విస్తారా ఫ్లైట్ UK17కి సోషల్ మీడియాలో సెక్యూరిటీ బెదిరింపు వచ్చింది. ప్రోటోకాల్‌కు అనుగుణంగా, సంబంధిత అధికారులందరికీ సిబ్బంది వెంటనే సమాచారం అందించారు. ముందు జాగ్రత్త చర్యగా, పైలట్‌లు విమానాన్ని ఫ్రాంక్‌ఫర్ట్‌కు మళ్లించారు. అక్కడ తనిఖీలు చేసిన తర్వాత తిరిగి లండన్ వెళ్లిపోయింది. కాగా, ఇటీవలి రోజుల్లో ఈ బూటకపు బెదిరింపులు బాగా పెరిగిపోతున్నాయి. కేవలం ఒక వారంలోనే 15 విమానాలకు నకిలీ బెదిరింపులు వచ్చాయి. ఇలాంటి తప్పుడు బెదిరింపులను అరికట్టేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు.