Israel-Hamas: గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తూనే ఉంది. తాజాగా ఉత్తర గాజాలో జరిపిన వైమానిక దాడుల్లో సుమారు 33 మంది పాలస్తీనా ప్రజలు మృత్యి చెందారు. ఈ విషయాన్ని అక్కడి అధికారిక వార్తా సంస్థ తెలిపింది. ఉత్తర గాజాలోని జబాలియా శిబిరంపై శుక్రవారం రాత్రి ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఆ దాడుల్లో మరణించిన వారిలో 21 మంది మహిళలే ఉండటం గమనార్హం. ఈ దాడుల్లో మరో 85 మందికి పైగా తీవ్ర గాయాలు అయ్యాయి. అనేక మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉందని సమాచారం.
Read Also: IND vs NZ: టీమిండియాకు శుభవార్త.. నేడు బ్యాటింగ్‌కు పంత్!
ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్ దాడుల కారణంగా ఇప్పటి వరకు 42,500 మందికి పైగా మృతి చెందినట్లు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇక, ఇజ్రాయెల్‌పై సిరియా వైమానిక దాడులు చేసేందుకు ప్రయత్నించింది. తమ భూభాగాన్ని లక్ష్యంగా చేసుకుని జరిపిన వైమానిక దాడులను ఐడీఎఫ్ సమర్థవంతంగా ఎదుర్కొన్నట్లు తెలిపింది. అది తమ భూభాగంలోకి ప్రవేశించక ముందే ఆ రాకెట్లను కూల్చివేసినట్లు వెల్లడించింది. ఇరాన్ మద్దతుతోనే సిరియా ఈ డ్రోన్లతో దాడి చేసేందుకు యత్నించిందని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది.